justice for lovi assumi: మృగాళ్ల పైశాచికత్వం.. అమ్మాయి దుస్తులు చింపేసి, ఘోరం.. వీడియో వైరల్..
Facts Justice Lovi Assumi Molestation Video: ఓ యువతి ఆత్మహత్య ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని కుదిపేస్తోంది. ఇరవై ఐదేళ్ల లోవీ అస్సుమీ ఆత్మహత్యకు దారితీసిన ఉదంతంపై అందరూ గళమెత్తుతున్నారు. నాగాలాండ్‌కు చెందిన లోవి.. జోధ్‌పూర్‌లోని ఓ రెస్టారెంట్లో
Facts Justice Lovi Assumi Molestation Video: ఓ యువతి ఆత్మహత్య ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని కుదిపేస్తోంది. ఇరవై ఐదేళ్ల లోవీ అస్సుమీ ఆత్మహత్యకు దారితీసిన ఉదంతంపై అందరూ గళమెత్తుతున్నారు. నాగాలాండ్‌కు చెందిన లోవి.. జోధ్‌పూర్‌లోని ఓ రెస్టారెంట్లో పని చేస్తోంది. ఈ క్రమంలో మే 23న తానుంటున్న గదిలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్లో ఓ వీడియో రిలీజ్ అయ్యింది. నలుగురు వ్యక్తులు, ఓ మహిళ కలిసి ఓ అమ్మాయిని దుస్తులు చించేసి శారీరకంగా హింసించిన వీడియోను ఇంటర్నెట్లో ఉంచారు. కొందరు లోవీ అస్సుమీ ఉరికి వేలాడుతున్న ఫొటోలను, వేధింపుల వీడియోను, అందులోని స్క్రీన్ షాట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఉంది లోవి అస్సుమీ అని, ఆ అవమాన భారం తట్టుకోలేకే ఆమె సూసైడ్ చేసుకుందన్న ప్రచారం ముమ్మరంగా ప్రారంభమైంది. దీంతో ఆమెకు న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు ఉద్యమిస్తున్నారు. దీనికోసం ఏర్పాటైన #justiceforloviassumi అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా ట్విట్టర్ ను కుదిపేస్తున్నారు.
వేర్వేరే ఘటనలు అయితే నాగాలాండ్ యువతి సూసైడ్‌కి, ఆ వీడియోకు సంబంధం లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ అడిషినల్ డీజీపీ రాబిన్ హిబు కార్యాలయం నుంచి ఒక స్టేట్మెంట్ సైతం రిలీజ్ అయ్యింది. అవి రెండు వేర్వేరు ఘటనలని, ఈమేరకు రాజస్థాన్ డీజీపీతో సంప్రదించి ధృవీకరించినట్లు చెప్పారు. అంతేకాదు వీడియోలను నాగాలాండ్ యువతి సూసైడ్‌కి ముడిపెట్టి వైరల్ చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసును వేగంగా దర్యాప్తు జరపాలని గుజరాత్, మిజోరాం, రాజస్థాన్ పోలీసులకు సైతం సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ సమాచారంతో కొందరు యూట్యూబర్లు ఈ వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఘటనలో ఉన్న బాధితురాలు ఎవరైనా సరే.. నిందితులను శిక్షించాల్సిందేనని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అస్సాం పోలీసులు ఫేస్బుక్లో ఒక ప్రకటనను సైతం పోస్ట్ చేశారు. వీడియోలో ఐదుగురు ఉన్నారని, వాళ్ల ఆచూకీ చెబితే నజరానా అందిస్తామని వెల్లడించారు. ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలిదు. కానీ, నిందితుల సమాచారం అందిస్తే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామంటూ అస్సాం పోలీసులు వెల్లడించారు.
Also Read: