Kerala: నిఫా వైరస్ మరణాల శాతాన్ని కట్టడి చేశాం : వీణా జార్జ్
కేరళలో ఇటీవల వెలుగుచూసిన ప్రాణాంతక నిఫా వైరస్ ఆందోళన రేపిన సంగతి అందరికీ తెలిసందే. మొత్తం ఆరుగురికి ఈ వైరస్ పాజిటివ్‌గా తేలగా.. అందులో ఇద్దరు మృతి చెందారు. అలాగే మిగతా నలుగురు చికిత్స తీసుకొని ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి సమయానుకూల, సమర్థమంతమైన చర్యల వల్ల రోగుల మరణాలను దాదాపు 33 శాతానికి తగ్గించినట్లు వీణా జార్జ్ పేర్కొన్నారు.

కేరళలో ఇటీవల వెలుగుచూసిన ప్రాణాంతక నిఫా వైరస్ ఆందోళన రేపిన సంగతి అందరికీ తెలిసందే. మొత్తం ఆరుగురికి ఈ వైరస్ పాజిటివ్‌గా తేలగా.. అందులో ఇద్దరు మృతి చెందారు. అలాగే మిగతా నలుగురు చికిత్స తీసుకొని ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి సమయానుకూల, సమర్థమంతమైన చర్యల వల్ల రోగుల మరణాలను దాదాపు 33 శాతానికి తగ్గించినట్లు వీణా జార్జ్ పేర్కొన్నారు. అలాగే వైరస్ బారినపడిన వారిలో ఓ తొమ్మిది సంవత్సరాలున్న బాలుడు చాలా రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్నాడని, అయితే ఇప్పుడు అతడు కోలుకోవడం గొప్ప ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల వెలుగుచూసినటువంటి నిఫా కేసులు బంగ్లాదేశ్ వేరియంట్‌కు చెందినవి. అయితే ఈ ప్రమాదకర వేరియంట్ సోకినటువంటి వ్యక్తుల్లో 70 నుంచి 90 శాతం మంది మరణించే అవకాశాలు ఉంటాయి.
అయితే కోయ్‌కొడ్‌లో జిల్లాలో మాత్రం మొత్తం ఆరుగురు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీనివల్ల మరణాల శాతం 33.3కే పరిమితమైపోయింది. వాస్తవానికి ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. బాధితులను ముందుగానే గుర్తించడం అలాగే యాంటీవైరల్ మందులతో చికిత్స అందించడం లాంటివి మరణాలను తగ్గించేందుకు కారణమైనట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్న నలుగురి బాధితులతో కూడా తాను వీడియో కాల్ ద్వారా మాట్లాడినట్లు వీణా జార్జ్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. ఈ నాలుగో విడత వ్యాప్తిలో మొదటి రోగి తప్ప మిగతావారి నుంచి ఇతరులకు ఈ వైరస్ సోకలేదని వీణా జార్జ్ స్పష్టం చేశారు. సెప్టెంబరు 11 తర్వాత ఒక్క రోగికీ వైరస్ సోకకుండా నిరోధించే విషయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ తీసుకున్న జాగ్రత్త చర్యలు ఎంతగానో దోహదపడ్డాయని పేర్కొన్నారు.
అలాగే రాబోయే రోజుల్లో నిఫా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ప్రాణనష్టాన్ని పూర్తిగా నివారించడానికి పరిశోధన కార్యకలాపాలను మరింతగా బలోపేతం చేస్తామని మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు.. సెప్టెంబర్ 16 నుంచి స్థానికంగా కొత్త కేసులు నమోదు కాలేదు. దీంతో కొయ్‌కోడ్ జిల్లాలోని కంటైన్మెంట్ జోన్లతోపాటు మిగతా ప్రాంతాల్లో విధించినటువంటి ఆంక్షలను ఎత్తివేశారు. ఇదిలా ఉండగా.. భారత్ నుంచి శ్రీలంకకు నిఫా వైరస్ వ్యాప్తి ముప్పు చాలా తక్కువగానే ఉన్నట్లు శ్రీలంక ఆరోగ్యశాఖ పేర్కొంది. అలాగే కేరళలో ఇటీవల నిఫా కేసులు బయటపడటంతో.. ఈ అంటువ్యాధిపై శ్రీలంకవాసుల్లో ఆందోళన చేందారు. అయితే.. భారత్‌లోని కేరళ రాష్ట్రం నుంచి నిఫా వైరస్ వ్యాప్తికి సంబంధించిన విషయంలో శ్రీలంక తక్కువ ముప్పునే ఎదుర్కొంటున్నట్లు అక్కడి అంటువ్యాధుల విభాగం తెలిపింది. ఇదిలా ఉండగా.. కేరళలో 5 ఏళ్లలో నాలుగు సార్లు వైరస్ వ్యాప్తి చెందిందని.. కానీ స్థానిక యంత్రాంగం ఎప్పటికప్పుడు కట్టడి చేసిందని వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేసింది..




