కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. 13 విమానాల్లో పసిడి తరలించారా ?
కేరళలో 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో కొత్త విషయాలు బయట పడుతున్నాయి. మొత్తం 13 విమానాలను ఈ బంగారం స్మగ్లింగ్ కోసం వినియోగించారని ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ ఐ ఏ) భావిస్తున్నాయి. ఈ విమానాల ద్వారా..
కేరళలో 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో కొత్త విషయాలు బయట పడుతున్నాయి. మొత్తం 13 విమానాలను ఈ బంగారం స్మగ్లింగ్ కోసం వినియోగించారని ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ ఐ ఏ) భావిస్తున్నాయి. ఈ విమానాల ద్వారా మూడు, నాలుగు సార్లు బంగారం దొంగరవాణా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీని విలువ సుమారు 40 కోట్ల నుంచి 45 కోట్లవరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కేసులో నిందితులు స్వప్న సురేష్, సందీప్ నాయర్ ఇదివరకే ఎన్ ఐ ఏ కస్టడీలో ఉన్నారు. మరో నిందితుడైన ఫాజిల్ ఫరీద్ కోసం నాన్-బెయిలబుల్ వారంట్ జారీ అయ్యే సూచనలు ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఇతని కోసం బ్లూ నోటీసు జారీ చేయాలని ఇంటర్ పోల్ ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ కోరింది. ఒక నేరానికి సంబంధించి ఒక వ్యక్తి ఐడెంటిటీ, లొకేషన్ లేదా అతని కార్యకలాపాలపై సమాచారాన్ని సేకరించేందుకు ఇంటర్ పోల్ ఈ నోటీసును జారీ చేస్తుంది.
మరో నిందితుడైన సరిత్ ని తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్ ఐ ఏ… కస్టమ్స్ శాఖను కోరింది. కాగా…. ఈ బంగారం స్మగ్లింగ్ ద్వారా వఛ్చిన సొమ్మును హవాలా ద్వారా దుబాయ్ కి తరలించారని, ఈ ‘యవ్వారమంతా’ ఫాజిల్ ఫరీద్ ఆధ్వర్యంలో జరిగిందని అనుమానిస్తున్నారు.