Vande Bharat Train: జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం భారీగా హిమపాతం కురుస్తోంది. దీంతో ఆ ప్రాంతం అంతా సహజ సౌందర్యంతో కనువిందు చేస్తోంది. మంచుతో కప్పబడిన కొండలు, చినాబ్ బ్రిడ్జ్‌పై నుంచి దూసుకెళ్లే వందే భారత్ రైలు ప్రయాణం చూసేవారిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.