అందమైన జుట్టు, కరివేపాకు..  కథ మామూలుగా లేదు!

25  January 2026

Jyothi Gadda

కరివేపాకులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు జుట్టు వేర్లను బలపరుస్తాయి. దీంతో జుట్టు రాలడం తగ్గి, కొత్త జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉన్న కరివేపాకు జుట్టు కుదుళ్లను ఉత్తేజపరచడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

కరివేపాకు వాడటం వల్ల జుట్టు పలుచబడకుండా ఉంటుంది. ఇందులోని అమైనో ఆమ్లాలు జుట్టు రాలడాన్ని అరికట్టి, కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

కరివేపాకులో బాక్టీరియా, ఫంగస్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇది చుండ్రు, దురదను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లను అరికట్టి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి మరిగించి తయారు చేసిన నూనె జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి మంచిది. వారానికి రెండు లేదా మూడు సార్లు వాడితే మంచి ఫలితాలు వస్తాయి.

కరివేపాకు తల చర్మాన్ని శుభ్రపరుస్తుంది. పోషణను అందిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది. కరివేపాకు జుట్టు అకాల నెరిసి పోవటాన్ని నివారిస్తుంది.  

కరివేపాకు, పెరుగు/గుడ్డు తెల్లసొనతో మాస్క్ తయారు చేసి తలకు రాసుకోవాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.  కరివేపాకు జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. తరచూ మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది.