యూపీ సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట కలకలం..తల్లి, కూతురు ఆత్మహత్యాయత్నం..
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట తల్లీకూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సీఎం క్యాంప్ ఆఫీస్ లోక్ భవన్ ఎదుట అమేథికి చెందిన ఓ మహిళ తన కూమార్తెతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట తల్లీకూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సీఎం క్యాంప్ ఆఫీస్ లోక్ భవన్ ఎదుట అమేథికి చెందిన ఓ మహిళ తన కూమార్తెతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై వారిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
యూపిలోని అమెథికి చెందిన ఒమన్ ఆమె కుమార్తె శుక్రవారం సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. భూ వివాదం విషయంలో తమకు ఆన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వారు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే సీఎంకు ఫిర్యాదు చేస్తామంటూ..ఒమన్ తన కుమార్తెతో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చింది. హైసెక్యూరిటీ జోన్ లో శుక్రవారం సాయంత్రం 5.40గంటలకు ఒమన్ ఆమె కుమార్తె లు తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది. వారిని ప్రమాదం నుంచి కాపాడేందుకు ప్రయత్నించారు. గాయపడిన ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన ఆ తల్లి కూతుళ్ల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
కాగా, జరిగిన ఘటనపై సీఎం క్యాంప్ కార్యాలయం పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. భూవివాదంలో ఒమన్ క్యాంప్ కార్యాలయానికి వచ్చి ఆత్మహత్య చేసుకుందని, సీఎం ను కూడా కలవలేదని తెలిపారు. బాధితుల ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తామని తెలిపారు.