నా అందానికి సీక్రెట్ అదే.. రోజూ ఏం తింటానంటే.. సమంత.. 

Rajitha Chanti

Pic credit - Instagram

24 January 2026

చాలా కాలం తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో కంబ్యాక్ ఇస్తుంది సమంత. ఇటీవల టీజర్‏తోనే సంచలనంగా మారింది ఈ బ్యూటీ.

అలాగే కొన్ని రోజుల క్రితం పూర్తిగా సన్నగా మారిన సామ్.. ఇప్పుడు మరింత అందంగా మారింది. తాజాగా తన డైట్ సీక్రెట్ రివీల్ చేసింది. 

రోజూ తాను ఒకేరకమైన భోజనం చేస్తానని అంటుంది సామ్. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్‌ను ఫాలో అవుతానని .. సరిపోయే ఆహారమే తీసుకుంటుందట. 

రోజూ ఒకేరకమైన ఆహారం తీసుకుంటే బోరింగ్ గా ఉంటుందని.. అయినప్పటికీ కఠినమైన అలాంటి ఆహరమే తీసుకుంటానని అంటుంది. 

తాను సేంద్రీయ ఆహారాన్ని కొనడానికి ఆసక్తి చూపిస్తానని అంటుంది. రోజూ ఒకేరకమైన ఆహారం కావడం వల్ల ఎక్కువగా ఆలోచించదట.

అలాగే తన వంటగదిలో తప్పనిసరిగా ఉండాల్సిన వాటిలో క్రూసిఫెరస్ కూరగాయలు (బ్రోకలీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ మొలకలు)

నెయ్యి, కోల్డ్-ప్రెస్డ్ ఆయిల్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, పసుపు, సెలెరీ, అకాయ్ బెర్రీలు పుష్కలంగా ఉంటాయని తెలిపింది సామ్. 

అలాగే గ్లూటెన్ వంటి ఆహారం ఎప్పటికీ తీసుకోనని తెలిపింది. డైట్ తోపాటు వ్యాయమం, యోగా చేయడం ముఖ్యమే అంటుంది.