AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్ కార్డు బిల్ కట్టలేక నెత్తి కొట్టుకుంటున్నారా.. ఈ మ్యాజిక్ టిప్స్ ఫాలో అయితే సిబిల్ అస్సలే తగ్గదు..

క్రెడిట్ కార్డు.. చేతిలో ఉంటే కొండంత ధైర్యం.. కానీ దాని బిల్లు సకాలంలో కట్టకపోతే అదే ఒక తీరని భారం. ప్రతి నెలా బిల్లు కట్టే సమయంలో టెన్షన్ పడుతున్నారా? క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడంలో చేసే చిన్న తప్పులు మీ ఆర్థిక భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. భవిష్యత్తులో మీకు లోన్లు రావాలన్నా, తక్కువ వడ్డీకే రుణాలు దక్కాలన్నా మీ క్రెడిట్ ప్రొఫైల్ క్లీన్‌గా ఉండాలి. మీరు ఏం చేయాలంటే..?

Credit Card: క్రెడిట్ కార్డు బిల్ కట్టలేక నెత్తి కొట్టుకుంటున్నారా.. ఈ మ్యాజిక్ టిప్స్ ఫాలో అయితే సిబిల్ అస్సలే తగ్గదు..
Credit Card Bill Management
Krishna S
|

Updated on: Jan 24, 2026 | 2:21 PM

Share

ప్రస్తుతం భారతీయుల జీవితంలో క్రెడిట్ కార్డు ఒక అనివార్య భాగమైంది. ఇటీవల వెల్లడైన నివేదికల ప్రకారం.. గతేడాది ఫెస్టివ్ సీజన్‌లో క్రెడిట్ కార్డు వినియోగం భారీగా పెరిగింది. దాదాపు 42 శాతం మంది యూజర్లు రూ.50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని షాపింగ్ కోసం ఖర్చు చేశారు. ఇందులో 20 శాతం మంది లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేయడం విశేషం. అయితే ఖర్చు చేయడం ఎంత సులభమో, ఆ బిల్లును సకాలంలో చెల్లించడం అంతకంటే ముఖ్యం. లేదంటే మీ సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. క్రెడిట్ కార్డు బిల్లులను స్మార్ట్‌గా మేనేజ్ చేసి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి నిపుణులు సూచిస్తున్న చిట్కాలు ఇవే..

ఆటోమేటిక్ పేమెంట్స్ సెట్ చేసుకోండి

బిజీ లైఫ్‌లో బిల్లు కట్టాల్సిన తేదీని మర్చిపోవడం సహజం. అందుకే మీ బ్యాంక్ అకౌంట్ నుండి Auto-pay ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల గడువు తేదీనాడు ఆటోమేటిక్‌గా బిల్లు చెల్లించబడుతుంది. పెనాల్టీలు, లేట్ ఫీజుల భయం ఉండదు.

శాలరీ రాగానే పేమెంట్ చేయండి

నెల ఆఖరు వరకు ఆగకుండా మీ జీతం క్రెడిట్ అయిన వెంటనే క్రెడిట్ కార్డు బిల్లును క్లియర్ చేసే అలవాటు చేసుకోండి. దీనివల్ల ఇతర ఖర్చుల వల్ల డబ్బు అయిపోయి బిల్లు పెండింగ్‌లో పడే అవకాశం ఉండదు.

రిమైండర్స్ – స్టేట్‌మెంట్ పరిశీలన

బ్యాంకులు పంపే ఇమెయిల్స్, ఎస్ఎమ్ఎస్‌లను ఎప్పటికప్పుడు గమనించండి. క్యాలెండర్‌లో రిమైండర్ సెట్ చేసుకోండి. మీ స్టేట్‌మెంట్‌ను నెలకు ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేయడం వల్ల ఏవైనా అదనపు ఛార్జీలు లేదా తప్పుగా జరిగిన ట్రాన్సాక్షన్లను గుర్తించవచ్చు.

గడువు కంటే ముందే చెల్లింపు

చివరి నిమిషం వరకు వేచి చూడటం వల్ల టెక్నికల్ సమస్యలు వచ్చి పేమెంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అందుకే డ్యూ డేట్ కంటే 4-5 రోజుల ముందే పేమెంట్ చేయడం సురక్షితం. ఇది మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తుంది.

బిల్లు కట్టలేనప్పుడు ఏం చేయాలి..?

ఒక్కోసారి ఆర్థిక ఇబ్బందుల వల్ల పూర్తి బిల్లు కట్టడం సాధ్యం కాకపోవచ్చు. అటువంటప్పుడు కనీసం మినిమమ్ డ్యూ అయినా చెల్లించండి. దీనివల్ల డిఫాల్టర్ ముద్ర పడదు. కానీ మిగిలిన మొత్తంపై వడ్డీ పడుతుందని గుర్తుంచుకోండి. పెద్ద మొత్తంలో బిల్లు ఉన్నప్పుడు దానిని తక్కువ వడ్డీతో కూడిన ఈఎమ్ఐగా మార్చుకోవడం ఉత్తమం. బిల్లు అస్సలు కట్టకుండా ఉండటం కంటే ఇది మేలు. సిబిల్ స్కోర్‌లో క్రెడిట్ కార్డు పేమెంట్ హిస్టరీ కీలక పాత్ర పోషిస్తుంది. సకాలంలో చెల్లింపులు చేయడం వల్ల భవిష్యత్తులో మీకు తక్కువ వడ్డీకే హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

క్రెడిట్ కార్డు బిల్ కట్టలేక నెత్తి కొట్టుకుంటున్నారా.. ఈ టిప్స్
క్రెడిట్ కార్డు బిల్ కట్టలేక నెత్తి కొట్టుకుంటున్నారా.. ఈ టిప్స్
అటువంటి నటన నా జీవితంలో చూడలేదు: యాక్టర్ శత్రు
అటువంటి నటన నా జీవితంలో చూడలేదు: యాక్టర్ శత్రు
పెళ్లిలో రస్‌గుల్లా ఆట..! భలే క్యాచ్‌పట్టిన వధువు.. ఫన్నీ వీడియో
పెళ్లిలో రస్‌గుల్లా ఆట..! భలే క్యాచ్‌పట్టిన వధువు.. ఫన్నీ వీడియో
మళ్లీ రెచ్చిపోయిన హార్దిక్..ఈసారి ఏకంగా టీవీ కామెంటేటర్ మీదే
మళ్లీ రెచ్చిపోయిన హార్దిక్..ఈసారి ఏకంగా టీవీ కామెంటేటర్ మీదే
హోమ్ లోన్ తీసుకునే ముందు ఇవి పక్కా తెలుసుకోండి.. ఇలా చేస్తే మీకు
హోమ్ లోన్ తీసుకునే ముందు ఇవి పక్కా తెలుసుకోండి.. ఇలా చేస్తే మీకు
టోన్డ్ మిల్క్ లేదా నార్మల్ మిల్క్... ఏది బెటర్? నిపుణుల మాట ఇదే
టోన్డ్ మిల్క్ లేదా నార్మల్ మిల్క్... ఏది బెటర్? నిపుణుల మాట ఇదే
కొబ్బరి లేకుండా కొబ్బరి చట్నీ తయారు చేయోచ్చని తెలుసా..
కొబ్బరి లేకుండా కొబ్బరి చట్నీ తయారు చేయోచ్చని తెలుసా..
గోల్డ్‌.. సామాన్యులకు ఇక అందని ద్రాక్షేనా..!
గోల్డ్‌.. సామాన్యులకు ఇక అందని ద్రాక్షేనా..!
ఎన్నికల బరిలోకి కేసీఆర్ కూతురు.. సింహం గుర్తుతోరంగంలోకి
ఎన్నికల బరిలోకి కేసీఆర్ కూతురు.. సింహం గుర్తుతోరంగంలోకి
బరువు తగ్గాలని ఆ పౌడర్‌ తిని.. అంతలోనే అనంతలోకాలకు
బరువు తగ్గాలని ఆ పౌడర్‌ తిని.. అంతలోనే అనంతలోకాలకు