తెలంగాణ ఈగల్ టీమ్, ఎక్సైజ్ శాఖ హైదరాబాద్‌లో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాయి. బేగంపేట వద్ద ఒడిశాకు చెందిన మమత దిగల్ అనే మహిళ సూట్‌కేసులో 8 లక్షల విలువైన గంజాయి ప్యాకెట్లతో పట్టుబడింది. నాంపల్లిలోనూ గంజాయి విక్రయిస్తున్న గణేష్, సరళలను అరెస్టు చేయగా, మరికొందరు పరారీలో ఉన్నారు.