Konaseema Parrot Dispute: అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో రూ.80 వేల చిలక వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. కొత్తపాలానికి చెందిన బండారు దొరబాబు తన రూ.80,000 విలువైన పెంపుడు చిలక చార్లీ ఎగిరిపోవడంతో ఆవేదన చెందాడు. అదే గ్రామంలో ఒక ఇంటి వద్ద బంధించిన చిలకను తిరిగి ఇప్పించాలని కోరుతూ దొరబాబు పోలీసులను ఆశ్రయించనున్నాడు.