AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బ.. మటన్ బోటి, గోంగూర.. నోరూరే ఈ కాంబినేషన్‌తో ఆ సమస్యలన్నీ మటుమాయమే..

మటన్ బోటిని చాలా మంది.. ఇష్టంగా వండుకుని తింటారు.. కొందరు బోటిని ఫ్రై, కూర చేసుకుంటారు.. మరికొందరు.. బోటిలో గోంగూర వేసి వండుతారు.. గోంగూర బోటి కూర అనేది తెలుగు రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందిన.. ప్రత్యేకమైన రుచిని అందించే వంటకం.. పుల్లగా.. ఎంతో రుచిగా ఉంటుంది.

అబ్బ.. మటన్ బోటి, గోంగూర.. నోరూరే ఈ కాంబినేషన్‌తో ఆ సమస్యలన్నీ మటుమాయమే..
Mutton Boti And Gongura Cur
Shaik Madar Saheb
|

Updated on: Jan 24, 2026 | 4:08 PM

Share

నాన్ వెజ్ ప్రియులు మటన్ బోటిని ఎంతో ఇష్టంగా తింటారు. మేక ప్రేగుల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయని డైటీషియన్లు కూడా చెబుతున్నారు. బోటీలో వీటిలో ఐరన్, జింక్, విటమిన్లు సమృద్ధిగా ఉండి, రక్తహీనతను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.. ఇన్ని పోషకాలున్న మటన్ బోటిని చాలా మంది.. ఇష్టంగా వండుకుని తింటారు.. కొందరు బోటిని ఫ్రై, కూర చేసుకుంటారు.. మరికొందరు.. బోటిలో గోంగూర వేసి వండుతారు.. గోంగూర బోటి కూర అనేది తెలుగు రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందిన.. ప్రత్యేకమైన రుచిని అందించే వంటకం.. పుల్లగా.. ఎంతో రుచిగా ఉండే ఈ వంటకాన్ని సులభమైన పద్ధతిలో ఇంట్లోనే తయారు చేసుకోని తినవచ్చు.. ఈ కూర అన్నం, చపాతీ, రోటీలు, అలాగే పలావ్ లేదా బిర్యానీ వంటి వాటితో చాలా అద్భుతంగా ఉంటుంది..

అయితే.. గోంగూర బోటి రెండూ కలపడం వల్ల పోషక విలువలు మరింత పెరుగుతాయి..

గోంగూర బోటి కర్రీలో గోంగూర వల్ల ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. బోటిలో ప్రోటీన్లు, జింక్, మెగ్నీషియం ఉండటం వల్ల శక్తినిచ్చి, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది, మొత్తంగా ఈ కర్రీ పోషకాలతో నిండి ఉంటుంది, కానీ మితంగా తీసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..

గోంగూరలో విటమిన్ A, C, B కాంప్లెక్స్, ఐరన్, క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్ వంటివి పుష్కలంగా ఉంటాయి.. ఇవి రక్తహీనతను నివారించి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయ పనితీరుకు మద్దతు ఇస్తుంది. బోటి (మటన్ పేగు) లో ప్రోటీన్లు, పొటాషియం, జింక్, మెగ్నీషియం ఉంటాయి.. ఇవి శరీరానికి శక్తినిచ్చి, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి..

గోంగూర బోటి తయారీ విధానం..

మొదట బోటీని వేడి నీటితో శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్‌లో బోటీని పసుపు, ఉప్పు, నీరు కలిపి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికిన బోటీ నుండి నీటిని తీసివేయాలి. తరువాత, రెండు గుప్పెళ్ల శుభ్రం చేసిన గోంగూరను పావు కప్పు నీటితో ఒక పాన్‌లో వేసి, మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. గోంగూర ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. ఒక పాన్‌లో నూనె వేడిచేసి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. పసుపు, ఉప్పు, ఉడికించిన బోటీ ముక్కలు, టమాటా ముక్కలు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత రెండు కప్పుల నీరు పోసి, మూత పెట్టి 5-6 నిమిషాలు ఉడికించాలి. చివరగా, ఉడికించిన గోంగూర మిశ్రమాన్ని చేర్చి, 10 నిమిషాలు ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఈ రుచికరమైన గోంగూర బోటి కూరను అన్నం, చపాతీ లేదా రోటీలతో వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు.

మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే.. వైద్య నిపుణులను సంప్రదించి తీసుకోవడం మంచిది..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నోరూరించే గోంగూర, మటన్ బోటి
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నోరూరించే గోంగూర, మటన్ బోటి
3 లక్షలకుపైగా స్కూటర్ల రీకాల్‌.. ఇందులో మీ స్కూటర్‌ కూడా ఉందా?
3 లక్షలకుపైగా స్కూటర్ల రీకాల్‌.. ఇందులో మీ స్కూటర్‌ కూడా ఉందా?
CPRతో పునర్ జన్మ.. ఎమర్జెన్సీ టైంలో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?
CPRతో పునర్ జన్మ.. ఎమర్జెన్సీ టైంలో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?
రథ సప్తమి రోజున తప్పక చేయాల్సినవి.. చేయకూడనవి తెలుసా?
రథ సప్తమి రోజున తప్పక చేయాల్సినవి.. చేయకూడనవి తెలుసా?
30 రోజులు ఈ ఆసనం వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఫుల్ ఖుష్!
30 రోజులు ఈ ఆసనం వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఫుల్ ఖుష్!
కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా..!
కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా..!
నైన్టీస్ కిడ్స్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ సీరియల్ సాంగ్.. ❤️
నైన్టీస్ కిడ్స్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ సీరియల్ సాంగ్.. ❤️
నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే..
నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే..
పతంజలి బిజినెస్‌ మోడల్‌ ప్రపంచ బ్రాండ్లలో ఎలా సూపర్ హిట్ అయింది?
పతంజలి బిజినెస్‌ మోడల్‌ ప్రపంచ బ్రాండ్లలో ఎలా సూపర్ హిట్ అయింది?
తల్లులూ డైపర్లు వాడే ముందు ఈ తప్పు అస్సలు చేయకండి
తల్లులూ డైపర్లు వాడే ముందు ఈ తప్పు అస్సలు చేయకండి