కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా.. తెగబడ్డ తెంపుడుగాళ్లు.. భయంతో వణుకుతున్న మహిళలు!
సంగారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు.. ఒంటరిగా రోడ్లపై వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ.. వారి మెడలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్తున్నారు. మొన్నటికి మొన్న గడ్డపోతరం మున్సిపల్ పరిధిలో బాయమ్మ అనే మహిళ మెడలో నుండి మూడు తులాల బంగారు గొలుసు ఘాటన మరవకముందే మరో చైన్ స్నాచింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

సంగారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు.. ఒంటరిగా రోడ్లపై వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ.. వారి మెడలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్తున్నారు. మొన్నటికి మొన్న గడ్డపోతరం మున్సిపల్ పరిధిలో బాయమ్మ అనే మహిళ మెడలో నుండి మూడు తులాల బంగారు గొలుసు ఘాటన మరవకముందే మరో చైన్ స్నాచింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సాంకేతిక ఆధారాలతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్‌లో కంప్యూటర్ క్లాస్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న శ్రావణి అనే మహిళను దుండగులు అనుసరించారు. చీకటిగా ఉండే ప్రాంతం రాగానే ఆమె మెడలో నుండి బంగారు గొలుసు చోరీకి పాల్పడ్డారు. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకరు బైక్ సిద్ధంగా ఉండగా, మరొకరు నడుచుకుంటూ వెళ్లి మహిళ మెడలోని గొలుసును లాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె కింద పడిపోయినప్పటికీ, దుండగుడు కనికరించకుండా గొలుసు తెగే వరకు లాగారు. సుమారు 3 తులాల బంగారు గొలుసుతో పరారయ్యాడు.
చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు సమీపంలోని ఓ ఇంటి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సీసీ పుటేజీని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలావుంటే, పట్టణంలో దొంగల బెడద ఎక్కువైంది. మంగళ, బుధవారం రోజు రాత్రివేళ్లల్లో పలు కాలనీలో దొంగలు చోరీ కోసం తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
