AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నిరాడంబరంగా.. రిజిస్టర్ మ్యారేజ్‌తో ఒక్కటైన యువ ఐఏఎస్-ఐపీఎస్ జంట!

ఉన్నత చదువులు చదువుకుని, ఉన్నత ప్రభుత్వ హోదాల్లో కొనసాగుతున్నప్పటికీ, నిరాడంబరంగా ఓ ఐపీఎస్ అధికారిణి, శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారి వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగారెడ్డిగూడెంకు చెందిన ఐపీఎస్ అధికారిణి సుర్కంటి శేషాద్రిని రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి శనివారం (జనవరి 24, 2026) చట్టబద్ధంగా ఒక్కటయ్యారు.

Telangana: నిరాడంబరంగా.. రిజిస్టర్ మ్యారేజ్‌తో ఒక్కటైన యువ ఐఏఎస్-ఐపీఎస్ జంట!
Seshadrini Reddy Ips , Srikanth Reddy Ias
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jan 24, 2026 | 5:08 PM

Share

ఉన్నత చదువులు చదువుకుని, ఉన్నత ప్రభుత్వ హోదాల్లో కొనసాగుతున్నప్పటికీ, నిరాడంబరంగా ఓ ఐపీఎస్ అధికారిణి, శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారి వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగారెడ్డిగూడెంకు చెందిన ఐపీఎస్ అధికారిణి సుర్కంటి శేషాద్రిని రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి శనివారం (జనవరి 24, 2026) చట్టబద్ధంగా ఒక్కటయ్యారు. నిరాడంబరంగా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు.

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అత్యంత సాదాసీదాగా వీరి వివాహం జరిగింది. కేవలం ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు, ఉన్నతాధికారుల సమక్షంలో రిజిస్ట్రార్ ఎదుట సంతకాలు చేసిన ఈ జంట దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డీసీపీగా శేషాద్రిని రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ అధికారిగా శిక్షణ పొందుతున్నారు. ఈ జంట ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా వివాహం చేసుకుని నేటితరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అట్టహాసంగా పెళ్లిళ్లు చేసుకుంటున్న ఈ రోజుల్లో, ఉన్నత స్థాయిలో ఉన్న ఈ జంట నిర్ణయంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హోదా పెరిగినా ఒదిగి ఉండాలనే వీరి తీరు ఎందరికో స్ఫూర్తిని ఇస్తోంది. ఈ వేడుకకు హాజరైన పలువురు ఉన్నతాధికారులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..