దేవుడు సామీ నువ్వు.. బీఎండబ్ల్యూ కారుకు బొక్క పెట్టిన రైడర్.. ఓనర్ ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు..!
భారత వాణిజ్య రాజధాని ముంబైలో ఓ వ్యక్తి ప్రవర్తన ఇప్పుడు అనేక మంది ప్రశంసలను అందుకుంటోంది. ముంబైకి చెందిన నటుడు సిద్ధార్థ్ భరద్వాజ్ బీఎండబ్ల్యూ కారు ప్రమాదానికి గురైంది. ఓ డెలివరీ ఎగ్జిక్యూటివ్ బైక్‌పై వేగంగా వచ్చి అతడి ఖరీదైన కారును ఢీకొట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

చాణక్యుడు చెప్పిన గొప్ప గుణాలలో ఒకటి క్షమించడం. ఇటీవల కాలంలో క్షమించడం లక్షణం చాలా మందిలో కొరవడిందనే చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు, తప్పులకు కూడా ఎదుటివారిపై అరిచేస్తుంటారు. కోపంతో దూషిస్తుంటారు. మరికొందరైతే చేయి చేసుకునేందుకు కూడా వెనుకాడరు. కానీ, క్షమించడం అనే గుణం కలిగిన వారు అనేక హృదయాలను గెలుచుకుంటారు. భారత వాణిజ్య రాజధాని ముంబైలో ఓ వ్యక్తి ప్రవర్తన ఇప్పుడు అనేక మంది ప్రశంసలను అందుకుంటోంది. ముంబైకి చెందిన నటుడు సిద్ధార్థ్ భరద్వాజ్ బీఎండబ్ల్యూ కారు ప్రమాదానికి గురైంది. ఓ డెలివరీ ఎగ్జిక్యూటివ్ బైక్‌పై వేగంగా వచ్చి అతడి ఖరీదైన కారును ఢీకొట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే..
పార్క్ చేసి ఉంచిన సిద్ధార్థ్ భరద్వాజ్ కారును డెలివరీ ఎగ్జిక్యూటివ్ విశాల్ తన బైక్‌తో బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆ కారుకు పెద్ద గీతతోపాటు నొక్కు పడింది. అయితే, ఆ ఎగ్జిక్యూటివ్ కావాలని చేసింది కాదు.. పొరపాటున జరిగిన ప్రమాదం ఇది. తన కారుకు పడిన గీతలను, నొక్కును చూసిన సిద్ధార్థ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కారుకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఈ నేపథ్యంలో సదరు ఎగ్జిక్యూటివ్ రైడర్ ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యాడు. తన తల్లికి క్యాన్సర్ ఉందని, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుందని ఆవేదన వ్యక్తంచేశాడు. తాను 3 వేల నుంచి 4 వేల రూపాయల వరకు మాత్రమే చెల్లించగలనని చెప్పాడు. తన తల్లి క్యాన్సర్ చివరి దశలో ఉందని తెలిపాడు. ఆస్పత్రికి సంబంధించిన బిల్లులు కూడా చూపించాడు. ఈ క్రమంలో అప్పటి వరకు ఆగ్రహంతో ఊగిపోయిన సిద్ధార్థ్.. ఒక్కసారిగా తన ప్రవర్తన మార్చుకున్నాడు.
డెలివరీ ఎగ్జిక్యూటివ్ విశాల్ నుంచి ఒక్క పైసా కూడా అడగలేదు సిద్ధార్థ్. ఆ తర్వాత అతడ్ని కౌగలించుకుని ఎలాంటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
View this post on Instagram
అయితే, సిద్ధార్థ్ చూపిన మానవత్వానికి అనేక మంది నెటిజన్లు స్పందించి అతనికి నష్ట పరిహారంగా పెద్ద మొత్తాన్ని అతనికి ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేశారు. తనకు సోషల్ మీడియా వినియోగదారులు కొందరు రూ. 25వేల నుంచి 30 వేల వరకు పంపించారని సిద్ధార్థ్ మరో పోస్టులో తెలియజేశారు. అయితే, ఈ మొత్తం కూడా డెలివరీ ఎగ్జిక్యూటివ్ తల్లి చికిత్స కోసమే చెలిస్తానంటూ మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నాడు సిద్ధార్థ్. దీంతో అతనిపై నెటిజన్లు మరింతగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మంచి పనితో అనేక మంది హృదయాలను గెలిచుకున్నారంటూ సిద్ధార్థ్‌ను అభినందిస్తున్నారు. మానవత్వం బతికే ఉందని నిరూపించావంటూ కొనియాడుతున్నారు. మీరు ఇలాగే మంచి పనులు కొనసాగించాలని కోరారు.
