Viral News: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు! రాత్రికి రాత్రే బ్రిడ్జ్‌ను మాయం చేసిన కేటుగాళ్లు.. ఎందుకంటే?
Chhattisgarh bridge stolen: ఎక్కడైనా ఇంట్లో ఉన్న వస్తువులనో లేదా షాప్‌లలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కానీ ఇక్కడ కొందరు వ్యక్తులు మాత్రం ఏకంగా ఒక కాలువపై వేసి ఉన్న స్టీల్ వంతెననే రాత్రి రాత్రే ఊడాయించుకెళ్లారు. సుమారు 10 టన్నుల బరువున్న ఆ వంతెనను గ్యాస్ కట్టర్లతో పార్ట్ పార్ట్‌లుగా కట్ చేసి ఎత్తుకెళ్లారు. ఈ వింత ఘటన చత్తీస్‌గడ్ రాష్ట్రంలోని రాయ్‌గడ్ జిల్లాలో వెలుగు చూసింది.

సుమారు 60 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు 10 టన్నుల బరువున్న ఓ ఉక్కు వంతెనను స్క్రాప్ మాఫియా రాత్రిరాత్రే ఎత్తుకెళ్లిన ఘటన చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఉదయం నిద్రలేచిన స్థానికులకు వంతెన కనిపించకపోవడంతో అధికారులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కోర్బా జిల్లాలోని దోధిపారా ప్రాంతం హస్డియో ఎడమ కాలువపై నాలుగు దశాబ్ధాల క్రితం ఒక ఉక్కు వంతెనను నిర్మించారు. 60 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు 10 టన్నుల బరువు ఉంటుంది.
అయితే జనవరి 17న రాత్రి 11 గంటల వరకు స్థానికులు ఈ వంతెన రాకపోకలు సాగించారు. కానీ 18 నాడు ఉదయం లేచి చూడగా అక్కడ వంతెన కనిపించకపోయే సరికి వారందూ ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక 17వ వార్డు కౌన్సిలర్ లక్ష్మణ్ శ్రీవాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇదే ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
స్థానిక సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా జనవరి 17న రాత్రి 12 గంటల సమయంలో 15 మందిని గుర్తు తెలియని వ్యక్తులు బ్రిడ్జ్ వద్దకు చేరుకొని, గ్యాస్ కట్టర్లతో వంతెనను కట్ చేసి ఎత్తుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. వారిలో ఐదుగురిని అరెస్టు చేశామని, పట్టుబడిన వారు స్క్రాప్ మాఫియాకు చెందిన లోచన్ కేవత్, జైసింగ్ రాజ్‌పుత్, మోతీ ప్రజాపతి, సుమిత్ సాహు, కేశవ్‌పురి గోస్వామి అని పోలీసులు తెలిపారు. స్టీల్ రెయిలింగ్‌లను అమ్ముకొని చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ దొంగతనానికి పాల్పడినట్టు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
