AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్నకు ఇంతకు మించిన సంతోషం ఇంకేముంటుంది ..! తన ప్లేస్‌లో ఎస్సై‌గా కుమార్తెకు బాధ్యతల అప్పగింత

మాండ్యాలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ కుమార్తె వర్ష గత సంవత్సరం PSI పరీక్షలో అర్హత సాధించారు. ప్రొబేషనరీ PSI గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన వర్ష తన శిక్షణ పూర్తి చేసుకున్నారు. దీంతో ఆమె తండ్రి వెంకటేష్ పని చేస్తున్న పోలీస్ స్టేషన్ కు అధికారిగా ఛార్జ్ ఇచ్చారు.

నాన్నకు ఇంతకు మించిన సంతోషం ఇంకేముంటుంది ..! తన ప్లేస్‌లో ఎస్సై‌గా కుమార్తెకు బాధ్యతల అప్పగింత
Venkatesh Welcomed His Daughter
Surya Kala
|

Updated on: Jun 22, 2023 | 12:37 PM

Share

తల్లిదండ్రులకు పిల్లలు పుట్టిన సమయంలో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో.. అంతకంటే ఎక్కువ ఆనందాన్ని సంతోషాన్ని తమ పిలల్లు తమకంటే మంచి స్థానానికి చేరుకున్నప్పుడు పొందుతారు. ఇప్పుడు అదే ఆనందాన్ని ఓ తండ్రి పొందుతున్నారు. తాను పోలీసు అధికారికా విధులను నిర్వహిస్తున్న ప్లేస్ లోకి తన స్థానంలో తన కూతురు రావడంతో ఆ తండ్రి పొందిన సంతోషం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది చూపరులకు.. అంతేకాదు తానే స్వయంగా కుమార్తెకు గ్రాండ్ వెలకమ్ చెప్పారు. తాను పనిచేసిన స్టేషన్ లో తన విధులను తన కుమార్తెకు అప్పగించారు. ఈ ఘటనకు వేదికగా కర్ణాటక రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ వేదికగా మారింది. వివరాల్లోకి వెళ్తే..

మాండ్యాలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ కుమార్తె వర్ష గత సంవత్సరం PSI పరీక్షలో అర్హత సాధించారు. ప్రొబేషనరీ PSI గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన వర్ష తన శిక్షణ పూర్తీ చేసుకుంది. దీంతో ఆమె తండ్రి వెంకటేష్ పని చేస్తున్న పోలీస్ స్టేషన్ కు అధికారిగా ఛార్జ్ ఇచ్చారు. దీంతో తన పోలీస్ స్టేషన్ లో విధులను తీసుకోవడానికి వచ్చిన కుమార్తె వర్షకు వెలకమ్ చెబుతూ.. తన విధులను అప్పగించారు ఎస్సై వెంకటేష్. ఈ అరుదైన ఘటనను పోలీస్‌స్టేషన్‌లో అందరూ ఎంతో సంతోషముగా వీక్షించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తన కుమార్తె వర్షకు వెంకటేష్‌ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.

ఒక తరం నుంచి మరొక తరానికి అధికారాన్ని బదిలీ అవ్వడంతో అక్కడ ప్రాముఖ్యత సంతరించుకుంది. పూలతో స్వాగతం పలికిన వెంకటేష్.. వర్షకు పీఎస్‌ఐగా విధులను రాజదండంతో అప్పగించారు. వర్ష తండ్రి వెంకటేష్ 16 ఏళ్ల సైన్యంలో సేవలను అందించి అక్కడ రిటర్మెంట్ తర్వాత 2010లో ఎస్సై పరీక్షలు రాసి ఉత్తీర్ణతను సాధించారు. ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి మాండ్యాలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై గా పనిచేస్తున్నారు. తండ్రిని పోలీసు అధికారికగా చుసిన వర్షం ప్రేరణ పొంది.. తండ్రి బాటలో పయనిస్తూ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో అడుగు పెట్టాలనుకుంది. 2022 బ్యాచ్‌లో PSI పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.  గత ఏడాది కాలంగా ప్రోబేషనరీ PSI గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

యాదృచ్ఛికంగా ఏడాది ప్రొబేషనరీగా శిక్షణ పూర్తి చేసుకున్న వర్షకు తండ్రి పనిచేస్తున్న సెంట్రల్ పోలీస్ స్టేషన్‌కు కేటాయించబడింది.  వెంకటేశ్‌కు బదిలీ కాగా తండ్రి పనిచేసిన ప్లేస్ లో వర్ష  బాధ్యతలను స్వీకరించారు. అరుదైన సన్నివేశానికి వేదికైన పోలీస్టేషన్ లో ఇతర పోలీసు సిబ్బంది ప్రశంసల వర్షం కురిపించారు. సందడి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..