Shakti Scheme: శక్తి యోజనకు కేటాయించిన డబ్బులు 6 నెలలకే ఖాళీ.. మహిళల ఉచిత బస్సు ప్రయాణం రద్దు కొనసాగానే..? ?
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన శక్తి పథకం ద్వారా ఇప్పటికే లక్షలాది మంది మహిళలు ఉచిత బస్సు సేవలు పొందుతున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సీఎం సిద్ధరామయ్య బడ్జెట్‌లో కేటాయించిన సొమ్ము ఆరు నెలల్లోనే అయిపోతోందట. శక్తి యోజన కోసం కర్ణాటక సర్కార్ రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 2,800 కోట్లు కేటాయించింది.

కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన శక్తి పథకం ద్వారా ఇప్పటికే లక్షలాది మంది మహిళలు ఉచిత బస్సు సేవలు పొందుతున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సీఎం సిద్ధరామయ్య బడ్జెట్‌లో కేటాయించిన సొమ్ము ఆరు నెలల్లోనే అయిపోతోందట. శక్తి యోజన కోసం కర్ణాటక సర్కార్ రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 2,800 కోట్లు కేటాయించింది. అయితే నవంబర్ 5 వరకు మహిళా ప్రయాణీకుల జీరో టిక్కెట్ల విలువ రూ.2,143 కోట్లకు చేరుకుంది ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా ఐదు నెలల సమయం ఉండడంతో, బడ్జెట్‌లో కేటాయించిన నిధులు డిసెంబరు వరకు మాత్రమే వస్తాయని ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్లు స్పష్టం చేశాయి. అయితే ఈ పథకం ముందుకెళ్తుందా లేదా అన్నదీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
శక్తి పథకం అమలులోకి వచ్చిన కొద్ది నెలల తర్వాత ఉచిత బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని కేఎస్‌ఆర్‌టీసీ అధికారి ఒకరు తెలిపారు. కానీ ఇది జరగలేదు. సంఖ్య స్థిరంగా కొనసాగుతూనే ఉంది. శక్తి యోజనకు ఇంత మంచి స్పందన వస్తుందని ఊహించలేదంటున్నారు అధికారులు. టిక్కెట్ల విలువను ప్రభుత్వం ప్రతి నెలా కర్ణాటక బస్ కార్పొరేషన్లకు చెల్లిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ పథకానికి మరిన్ని నిధులు కేటాయిస్తేనే ఆర్టీసీ మనుగడ కొనసాగుతుందంటున్నారు కేఎస్‌ఆర్‌టీసీ అధికారులు. మరోవైపు ఈ విషయమై రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి స్పందిస్తూ.. డిసెంబర్‌లో శక్తి ప్రాజెక్టుకు మరిన్ని నిధులు మంజూరు చేస్తామన్నారు. డిసెంబర్ వరకు జారీ చేసిన మొత్తం టికెట్ విలువను పరిగణనలోకి తీసుకుని మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. .
ఇదిలావుంటే గృహలక్ష్మి, అన్న భాగ్య యోజన లబ్దిదారులకు ప్రతినెలా 20వ తేదీలోగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతినెలా 10 నుంచి 15వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆహార, పౌరసరఫరాల, స్త్రీ శిశు సంక్షేమ శాఖలను రాష్ట్ర ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




