MP Election: ఎన్నికల ప్రచారంలో పేలుతున్న మాటలతూటాలు.. రాహుల్ గాంధీ పై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పొలిటికల్ వార్ రసవత్తరంగా కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమంలో ఖాండ్వా ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన ఆరోపణలు చేశారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పొలిటికల్ వార్ రసవత్తరంగా కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమంలో ఖాండ్వా ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ రాంలాలా గుడికి వెళ్లలేదన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో మాత్రమే గుడికి వెళతారని, అది కూడా రహస్యంగా, బాబర్ గుడికి మాత్రమే వెళ్తారని బిస్వా అన్నారు. రామ మందిరానికి వెళ్లడం వల్ల బాబర్ ప్రజలు రగలిపోతారని, అందుకే భయంతో రామమందిరానికి వెళ్లరని, రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అంతేకాదు చత్తీస్‌గఢ్ పర్యటనలో అక్బర్, ఔరంగజేబుకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారో వివరణ ఇచ్చారు. ఈ దేశంలో పుట్టాను, బాబర్, అక్బర్ ఔరంగజేబుపై మాట్లాడతానని స్పష్టం చేశారు. జీవించి ఉన్నంత వరకు బాబర్ అక్బర్, ఔరంగజేబులకు వ్యతిరేకంగా మాట్లాడుతానని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశానని అస్సాం సీఎం అన్నారు. ఈ దేశంలో సనాతన్ హిందువును పడగొట్టడానికి బాబర్ మొదటి ప్రయత్నం చేశాడని ఆయన ఆరోపించారు. దీన్నిబట్టి నేటికీ జ్ఞానవాపి మసీదు స్థానంలో జ్ఞాన్వాపి ఆలయాన్ని ఎప్పుడు నిర్మిస్తారని పోరాడాల్సి వస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోకి ఇజ్రాయెల్, హమాస్ ప్రస్తావన తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు సీఎం హిమంత బిస్వా. రాహుల్ గాంధీ భారత్ హమాస్‌కు భయపడి హమాస్‌ను వ్యతిరేకించలేదని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక, భారత్‌లో బాంబు పేలుళ్లు లేవని హిమంత బిస్వా శర్మ అన్నారు. పొరపాటున ఎక్కడైనా బాంబు పేలితే, ఉగ్రవాదులు రెండు చేస్తే ప్రధాని మోదీ నాలుగు చేస్తాడని హెచ్చరించారు. ప్రధాని మోదీ పాకిస్థాన్ వెళ్లి తనకు కావాల్సిన వైద్యం ఇప్పించనున్నారు. ప్రధానమంత్రి దేశం కోసం ఏమైనా చేయగలడని భారతదేశం ప్రజలకు తెలుసనన్నారు హిమంత బిస్వా.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




