Boney kapoor: బోణీ కపూర్ కారులో భారీగా వెండి వస్తువులు.. కర్ణాటక ఎన్నికల తరుణంలో..
ఎన్నికల వేళ కర్నాటకలో బోనీ కపూర్ కారులో భారీగా వెండివస్తువులు పట్టుబడటం కలకలం రేపుతోంది. కర్నాటకలోని దావణగెరేలోని హెబ్బాళ్ టోల్‌గేట్ సమీపంలో ఈసీ తనిఖీల్లో ఓ కారులో 66 కేజీల వెండి వస్తువులు దొరికడం... ఆ కారు బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌కి చెందిన కంపెనీ పేరున రిజిస్టర్...
ఎన్నికల వేళ కర్నాటకలో బోనీ కపూర్ కారులో భారీగా వెండివస్తువులు పట్టుబడటం కలకలం రేపుతోంది. కర్నాటకలోని దావణగెరేలోని హెబ్బాళ్ టోల్‌గేట్ సమీపంలో ఈసీ తనిఖీల్లో ఓ కారులో 66 కేజీల వెండి వస్తువులు దొరికడం… ఆ కారు బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌కి చెందిన కంపెనీ పేరున రిజిస్టర్ అయివుండడం… సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని రోజుల్లో కర్ణటాటకలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే సరిహద్దుల్లోనూ…రాష్ట్రవ్యాప్తంగానూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. తనిఖీల్లో ఓ బీఎండబ్ల్యూ కారులో ఐదు బాక్సుల్లో వెండివస్తువులను గుర్తించారు ఎన్నికల కమిషన్ అధికారులు. వీటిని చెన్నై నుంచి ముంబై తరలిస్తున్నట్టు గుర్తించారు. వీటి విలువ దాదాపు 40 లక్షలుంటుంది. వీటిలో 66 కేజీల వెండి గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు ఉన్నాయి. అయితే వీటికి సరైన రసీదులు చూపకపోవడంతో వీటిని ఈసీ అధికారులు సీజ్ చేశారు.
కారు డ్రైవర్ సుల్తాన్ ఖాన్ సహా కారులో ప్రయాణిస్తోన్న మరో వ్యక్తి హరిసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కారు బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌కి చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై రిజిస్టరై ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఈ వస్తువులు బోనీ కుటుంబానికి చెందినవా? కాదా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..