Karnataka Elections: కర్నాటకలో రాహుల్ గాంధీ ప్రచారం.. ప్రజలపై హామీల వర్షం..
కర్నాటకలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు పాల్గొంటున్నారు. తాజాగా కోలార్‌లో జరిగిన సభకు హాజరయ్యారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ. అయితే, ఓటర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ నాలుగు కీలక వాగ్దనాలను చేసింది. హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను మొదటి కేబినెట్..

కర్నాటకలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు పాల్గొంటున్నారు. తాజాగా కోలార్‌లో జరిగిన సభకు హాజరయ్యారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ. అయితే, ఓటర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ నాలుగు కీలక వాగ్దనాలను చేసింది. హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆమోదించిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు రాహుల్‌గాంధీ.
గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి ఉచితంగా 200 యూనిట్ల కరెంట్, గృహలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2000, అన్న భాగ్య పథకం కింద ప్రతి కుటుంబానికి నెలకు 10 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అంతేకాకుండా డిగ్రీ చదివిని ప్రతి విద్యార్ధికి రెండేళ్ల పాటు రూ. 3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని వెల్లడించారు.
కమలంలో కల్లోలం..
మరోవైపు కర్నాటక కమలంలో కలకలం చోటుచేసుకుంది. కొత్తవారిని ప్రోత్సహించాలన్న బీజేపీ హైకమాండ్ ఆలోచన కర్నాటకలో అసమ్మతి జ్వాలలు రగిలిస్తోంది. తిరుగుబాటు జెండా ఎగరేస్తామని చెప్పిన ఒక్కరిద్దరూ దారిలోకి వచ్చినా మాజీ సీఎం శెట్టర్ లాంటి వాళ్లు పెద్ద షాకే ఇచ్చారు. చివరి ఛాన్స్ ఇవ్వాలని శెట్టర్ చేసిన విజ్ఞప్తిని కమలం పెద్దలు పరిగణనలోకి తీసుకోలేదు. పార్టీని వీడిన నేతలకు కర్నాటకు ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్తారని బీజేపీ నేతలు శపిస్తున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




