Viral: కరోనాతో చనిపోయాడని మృతదేహాన్నిచ్చారు.. కట్‌ చేస్తే, రెండేళ్ల తర్వాత ఇంటి ముందు ప్రత్యేక్షం..

భారత్‌లో కరోనా పెను విలయాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. మూడు వేవ్‌లలో కోట్లాది మంది కరోనా మహమ్మారి బారిన పడగా.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కోవిడ్‌ మహమ్మారి లక్షలాది కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చిందే. అయితే, తాజాగా.. ఓ ఘటన అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేసింది.

Viral: కరోనాతో చనిపోయాడని మృతదేహాన్నిచ్చారు.. కట్‌ చేస్తే, రెండేళ్ల తర్వాత ఇంటి ముందు ప్రత్యేక్షం..
Coronavirus
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 16, 2023 | 4:05 PM

భారత్‌లో కరోనా పెను విలయాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. మూడు వేవ్‌లలో కోట్లాది మంది కరోనా మహమ్మారి బారిన పడగా.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కోవిడ్‌ మహమ్మారి లక్షలాది కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చిందే. అయితే, తాజాగా.. ఓ ఘటన అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేసింది. రెండేళ్ల క్రితం కరోనా బారిన పడి మరణించిన వ్యక్తి.. ఇప్పుడు ఇంటిముందు ప్రత్యేక్షమవ్వడం చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. రెండేళ్ల క్రితం కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని.. వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వైద్యులు అప్పగించగా.. వారఉ అంత్యక్రియలు నిర్వహించారు. అదే వ్యక్తి ఇప్పుడు ఇంటి ముందు ప్రత్యక్షమయిన ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ధార్‌ జిల్లాలో వెలుగు చూసింది.

పోలీసులు, కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో కరోనావైరస్‌ రెండో వేవ్‌ సమయంలో కమలేశ్‌ పాటిదార్ (35) అనే వ్యక్తి వైరస్‌ బారినపడగా.. అతన్ని గుజరాత్‌ వడోదరలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ సమయంలో అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించి.. మృతదేహాన్ని అప్పగించారు. అప్పటి నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు అక్కడే అంత్యక్రియలు నిర్వహించి, స్వస్థలానికి వెళ్లిపోయారు.

ఇది జరిగిన దాదాపు రెండేళ్లు కావొస్తుంది.. ఈ క్రమంలో మృతిచెందాడునుకుంటున్న కమలేశ్‌ పాటిదార్ కడోడ్కలన్ గ్రామంలోని ఇంటికి చేరుకున్నాడు. చనిపోయాడనుకున్న వ్యక్తి.. ఇంటి ముందు ఒక్కసారిగా ప్రత్యక్షమవ్వడంతో.. అతన్ని చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఇన్నాళ్లు ఎక్కడున్నావని ప్రశ్నించగా.. అతని నుంచి సమాధానం రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో వారంతా అధికారులను ఆశ్రయించారు. కమలేశ్‌ను విచారించిన అనంతరం ఈ విషయంలో స్పష్టత వస్తుందని పోలీసులు మీడియాకు తెలిపారు.

అప్పుడు పీపీఈ కిట్ లో తమకు మృతదేహాన్ని అప్పగించారని.. అనంతరం అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే