మేమేమన్న సన్యాసులమా..?

కర్ణాటకలో రాజకీయ క్షణక్షణం మారుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 11 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో.. ఒక్కసారిగా కన్నడ రాజకీయాలు హీటెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందనే వార్తలు ఊపందుకోవడంతో.. అమెరికా పర్యటన నుంచి హుటాహుటిన సీఎం కుమారస్వామి బెంగళూరు చేరుకున్నారు. అయితే కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోతుందని తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర బీజేపీ ఛీఫ్ యడ్యూరప్ప ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నించగా.. సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:57 pm, Sun, 7 July 19
మేమేమన్న సన్యాసులమా..?

కర్ణాటకలో రాజకీయ క్షణక్షణం మారుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 11 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో.. ఒక్కసారిగా కన్నడ రాజకీయాలు హీటెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందనే వార్తలు ఊపందుకోవడంతో.. అమెరికా పర్యటన నుంచి హుటాహుటిన సీఎం కుమారస్వామి బెంగళూరు చేరుకున్నారు. అయితే కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోతుందని తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర బీజేపీ ఛీఫ్ యడ్యూరప్ప ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నించగా.. సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా వదులుకోవడానికి మేమేమన్న సన్యాసులమా..? అంటూ ఎదురు ప్రశ్నించారు.

మీరు చూస్తూ ఉండండి.. రాజీనామాల పర్వం పూర్తిగా ముగిసి స్పీకర్ ఓ నిర్ణయం తీసుకున్నాక.. మా పార్టీ నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. అప్పుడు మేము సన్యాసులం కాదని మీకు అర్థమవుతుందని యడ్యూరప్ప అన్నారు. తమది జాతీయ పార్టీ అని, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై జాతీయ నాయకులతో సంప్రదింపులు చేశాక ఓ నిర్ణయానికి వస్తామన్నారు. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందా అన్న ప్రశ్నకు.. చూస్తూ ఉండండంటూ సమాధానం ఇచ్చారు.