మరో బాంబు పేల్చిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు!

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు క్షణం క్షణం మారిపోతున్నాయి. సీఎం కుమారస్వామి సర్కార్ సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితులు కన్పించడం లేదు. తాజాగా ముంబైలో మకాం వేసిన రెబల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పడమే కాదు మరో బాంబు కూడా పేల్చారు. తమతో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్లుండి వరకు తాము ముంబైలోనే ఉంటామని ప్రకటించారు. కాగా ముఖ్యమంత్రిని మార్చాలని తాము డిమాండ్ చేయడం లేదని.. […]

  • Ravi Kiran
  • Publish Date - 12:21 am, Mon, 8 July 19
మరో బాంబు పేల్చిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు!

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు క్షణం క్షణం మారిపోతున్నాయి. సీఎం కుమారస్వామి సర్కార్ సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితులు కన్పించడం లేదు. తాజాగా ముంబైలో మకాం వేసిన రెబల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పడమే కాదు మరో బాంబు కూడా పేల్చారు. తమతో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్లుండి వరకు తాము ముంబైలోనే ఉంటామని ప్రకటించారు. కాగా ముఖ్యమంత్రిని మార్చాలని తాము డిమాండ్ చేయడం లేదని.. సుస్థిర ప్రభుత్వం కోసమే తమ ప్రయత్నమని రెబల్స్ స్పష్టం చేశారు.