Weather Alert: తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 2 రోజుల వెదర్ రిపోర్ట్
Weather: తెలంగాణలో చలి చంపేస్తోంది.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. ఎముకలు కొరికే చలితో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలిగాలులతో కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో నమోదయ్యాయి. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది..

Weather: తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. తీవ్రమైన చలితో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలిగాలులతో కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో నమోదయ్యాయి. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°C నుండి 4°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయని.. జాగ్రత్తలు అవసరం అని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది. డిసెంబర్ 26 వరకు చాలా జిల్లాల్లో 5 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
నిన్న ఆదిలాబాద్..7.8, పటాన్ చెరువు.. 8.4, మెదక్.. 8.3, రాజేంద్ర నగర్.. 9.5, హనుమకొండ.. 10.5, హయత్ నగర్..11.6, దుండిగల్..12.0, హైదరాబాద్..12.7, రామగుండం.. 12.8, నిజామాబాద్.. 12.6, ఖమ్మం..15.4, నల్గొండ..13.3, మహబూబ్ నగర్..14.7, హకీమ్ పేట.. 15.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
