న్యూ ఇయర్‌లో కొత్త ఫోన్ కొనాలనుకుంటే.. జనవరి 8న లాంచ్ అవుతున్న ఈ ఫోన్‌పై ఓ లుక్కేయండి!
2026 జనవరి 8న ఒప్పో రెనో 15 సిరీస్ ఇండియాలో విడుదల కానుంది. ఇందులో రెనో 15, రెనో 15 ప్రో, రెనో 15 ప్రో మినీ వేరియంట్‌లు ఉంటాయి. ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం, IP రేటింగ్‌లతో వస్తున్న ఈ ఫోన్ల ధర రూ. 40,000 నుండి రూ. 50,000 లోపు ఉండొచ్చని అంచనా.

చాలా మంది ఏదో ఒక అకేషన్ చూసుకొని ఫోన్లు కొంటూ ఉంటారు. పండగలకు ఆఫర్లు ఉండటం కూడా అందుకు ఓ కారణం. అయితే 2026లో ఒప్పో నుంచి ఓ సూపర్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒప్పో తన రెనో 15 సిరీస్‌ను ఇండియాలో లాంచ్‌కు డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. జనవరి 8న ఈ ఫోన్ మార్కెట్‌లోకి విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ధర, ఫీచర్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఒప్పో రెనో 15 సిరీస్ మోడళ్లలో 3 వేరియంట్‌లు
- ఒప్పో రెనో 15
- ఒప్పో రెనో 15 ప్రో
- ఒప్పో రెనో 15 ప్రో మినీ
ఒప్పో రెనో 15 సిరీస్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేశారు. IP66 + IP68 + IP69 రేటింగ్‌లతో వస్తుందని ఒప్పో ఇప్పటికే వెల్లడించింది.
‘ప్యాషనేట్గీక్జ్’ అనే టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ, ఒప్పో రెనో 15 సిరీస్ జనవరి 8 (2026)న భారతదేశానికి రావచ్చని, ఈ ఈవెంట్ మధ్యాహ్నం (భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు) ప్రారంభమవుతుందని సమాచారం. ధర విషయానికి వస్తే, ఒప్పో రెనో 15 సిరీస్ భారతదేశంలో రూ. 50,000 కంటే తక్కువ ధరకు లభించవచ్చు, అయితే రెనో 15 ప్రో మినీ రూ. 40,000 లోపు ధరకు రావచ్చు. కొన్ని నివేదికల ప్రకారం, రెనో 15 ప్రో దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ ధరకు లభిస్తుంది, అంటే ఇది భారతదేశంలో ఫ్లాగ్‌షిప్ లేదా హై-ఎండ్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుందని సూచిస్తుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
