AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: తన బోనులో దూరిన పాముకు చుక్కలు చూపింన సింహం.. చివరకు..

ఇటీవల తన బోనులోకి చొరబడిన పాముతో జరిగిన ఘోరమైన పోరాటంలో తీవ్రంగా గాయపడిన ఓ సింహం ఐదు రోజుల తర్వాత తుదిశ్వాస విడిచింది. తన శక్తినంతా ఉపయోగించి పాముపై తీవ్రంగా పోరాడినప్పడికి.. సాము పదేపదే సింహం ముఖంపై కాలు వేడంతో.. దాని విషం కారణంగా ఐదురోజుల తర్వాత వడోదరలోని సాయాజీబాగ్ జూలో ఉన్న ఆరేళ్ల సమృద్ధి అనే సింహం మరణించింది.

Watch Video: తన బోనులో దూరిన పాముకు చుక్కలు చూపింన సింహం.. చివరకు..
Lion Cobra Fight In Vadodara Zoo
Anand T
|

Updated on: Dec 24, 2025 | 8:27 AM

Share

పాముతో జరిగిన ఘోరమైన పోరులో తీవ్రంగా గాయపడిన ఓ సింహం ఐదు రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయిన ఘటన డోదరలోని సాయాజీబాగ్ జూలో వెలుగు చూసింది. అయితే గత వారం క్రితం జూలో ఉన్న సింహం బోనులోకి ఒక నాగుపాము వచ్చింది. అయితే దాన్ని గమనించిన సింహం ఆ పాముపై దాడి చేసింది. దీంతో పాము, సింహం మధ్య హోరాహోరీగా పోరాటం సాగింది. ఈ దాడిలో సింహం సైతం తీవ్రంగా గాయపడింది. అయితే పాము విషం మొత్తం సింహం ఒంట్లోకి పూర్తి ప్రవేశించడం ఇది జరిగిన ఐదు రోజుల తర్వాత సింహం మరణించింది.

దాడి జరిగిన వెంటనే సయాజీబాగ్ జూ బృందాలు సమృద్ధికి చికిత్స అందించారు, 24 గంటలూ సేవలు అందిస్తునే ఉన్నారు. అయినప్పటికీ శుక్రవారం సాయంత్రం సింహం తీవ్ర అనారోగ్యానికి గురై తుదిశ్వాస విడిచింది. సమృద్ధి మరణంతో వడోదరలోని ఐకానిక్ జూలో సింహం లేకుండా పోయింది. జూలో ఉన్న చిట్టచివరి సింహం సమృద్ది మాత్రమే.. ఇప్పుడు అది కూడా మరణించడంతో.. జూలో సింహాల జాడ అంతమైంది.

40 సంవత్సరాల విరామం తర్వాత తెల్ల పులులు వస్తున్నాయని జూ ఆనందంగా ప్రకటించిన రెండు రోజులకే సమృద్ధి మరణించింది. శుక్రవారం నాడు జూ కేర్‌టేకర్ డాక్టర్ ప్రత్యూష్ పతంకర్ మాట్లాడుతూ.. సమృద్ధిని కోల్పోవడం చాలా బాధాకరం అని అన్నారు. సింహం గాయపడిన తర్వాత రాజ్‌కోట్‌లోని ప్రద్యుమాన్ జూలాజికల్ పార్క్‌లో ఉన్న తెల్ల పులుల జంటను ఇక్కడికి తీసుకురావడాని తాము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. అదే సమయంలో సమృద్ది, పాము మధ్య జరిగిన గోడవ గురంచి తనకు కాల్ వచ్చినట్టు తెలిపారు. దీంతో తాను అక్కడి నుంచి ఇన్‌స్ట్రక్షన్ అందించానని.. అప్పటికే వైద్యులు సమృద్ది చికిత్స ప్రారంభించారని తెలిపారు. కానీ ఎంత ప్రయత్నించినా సమృద్దిని కాపాడలేకపోయామని చెప్పుకొచ్చారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.