Karnataka Cop: ఎంతైనా తల్లి హృదయం కదా..! విద్యార్థి కంటతడితో కరిగిన పోలీసు మనసు.. హృదయాన్ని తాకుతున్న వీడియో..
బెంగళూరులోని బాగల్‌కోట్ ఇలాకల్ నగర్‌లో జరిగిన ఈ ఘటన.. అందరి హృదయాలను బరువెక్కేలా చేసింది. ఇలాకల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా పోలీస్ విధులు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వెళ్లేవారిని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. ఆ క్రమంలో ట్రిబుల్ రైడింగ్ ఆమె కంటపడింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరుగెత్తి మరీ వారిని పట్టుకుంది. ఫైన్ కూడా వేశారు.
విధుల్లో చిత్తశుద్ది.. తేడా వస్తే తాటతీసే రకం. ఇవన్నీ ఒక వైపే. ఇంకోవైపు సేవా గుణం, మానవత్వం ఉందని చాటి చెప్పారో వుమెన్ పోలీస్. ట్రిపుల్ రైడింగ్‌పై కన్నెర్ర చేసిన ఆ పోలీస్.. ఆ తర్వాత స్టూడెంట్ ఆర్థిక పరిస్థితి తెలుసుకుని చలించిపోయారు. విద్యార్థిని అక్కున చేర్చుకుని ఆర్థిక సాయం చేసి మరీ అక్కడ్నుంచి పంపించేశారు. బెంగళూరులోని బాగల్‌కోట్ ఇలాకల్ నగర్‌లో జరిగిన ఈ ఘటన.. అందరి హృదయాలను బరువెక్కేలా చేసింది. ఇలాకల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా పోలీస్ విధులు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వెళ్లేవారిని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. ఆ క్రమంలో ట్రిబుల్ రైడింగ్ ఆమె కంటపడింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరుగెత్తి మరీ వారిని పట్టుకుంది. ఫైన్ కూడా వేశారు.
ఫైన్ విధించడంతో స్టూడెంట్ కన్నీటిపర్యంతమయ్యాడు. కాలేజీలో ఫీజు చెల్లించేందుకే డబ్బు లేదు… జరిమానా చెల్లించేదెలా అని వెక్కి వెక్కి ఏడ్చాడు. విద్యార్థి కంటతడితో మహిళా పోలీస్ కరిగిపోయింది. బిడ్డలా అక్కున చేర్చుకుంది. ట్రాఫిక్స్ రూల్స్‌పై అవగాహన కల్పిస్తూనే.. చేతిలో డబ్బు పెట్టి పంపించింది. ఈ సీన్ చూసిన వాళ్లంతా శభాష్ పోలీస్ అంటూ ప్రశంసించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..