Crime News: తన దగ్గర పనిచేస్తున్న బ్యూటీషియన్‌‌పై కాంగ్రెస్ నాయకుడి కన్ను.. ఎవరూ లేని సమయంలో..

తన సెలూన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిపై కాంగ్రెస్ నాయకుడి కన్ను పడింది. ఎవరూ లేని సమయంలో సెలూన్‌కు వెళ్లిన ఆయన ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Crime News: తన దగ్గర పనిచేస్తున్న బ్యూటీషియన్‌‌పై కాంగ్రెస్ నాయకుడి కన్ను.. ఎవరూ లేని సమయంలో..
Manoj Karjagi
Follow us

|

Updated on: Sep 18, 2022 | 3:26 PM

Karnataka Congress Leader Arrest: తన సెలూన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిపై కాంగ్రెస్ నాయకుడి కన్ను పడింది. ఎవరూ లేని సమయంలో సెలూన్‌కు వెళ్లిన ఆయన ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నాయకుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ నేత మనోజ్ కర్జగి ఓ సెలూన్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ సెలూన్‌లో గత కొంతకాలం నుంచి ఒక మహిళ బ్యూటీషియన్‌గా పని చేస్తున్నది. అయితే, శనివారం సెలూన్‌కు వెళ్లిన కర్జగి.. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అకస్మాత్తుగా మహిళా ఉద్యోగినిని హత్తుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రతిఘటించిన ఆమె తన స్నేహితుడికి ఫోన్‌ చేసింది. అతను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చి కాంగ్రెస్‌ నాయకుడు మనోజ్‌ పట్టుకొని కొట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై లైంగిక వేధింపులతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మనోజ్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పర్చి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

కాగా, ఈ సంఘటనపై కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. మనోజ్ కర్జగి, మాజీ మంత్రి అనుచరుడని అతను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాడని తెలిపింది. అతనిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాయువ్య కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ డైరెక్టర్‌గా కూడా మనోజ్ కర్జగి పనిచేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..