SBI: ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ ఛార్జీలు మాఫీ..
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా- SBI తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అలాగే మొబైల్ బ్యాంకింగ్ ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేసే మనీ ట్రాన్స్ ఫర్‌పై వసూలు చేసే SMS ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు..
SBI: స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా- SBI తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అలాగే మొబైల్ బ్యాంకింగ్ ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేసే మనీ ట్రాన్స్ ఫర్‌పై వసూలు చేసే SMS ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా USSD సేవల్ని ఉపయోగించుకోవచ్చని SBI ట్వీట్ చేసింది. *99# డయల్ చేసి బ్యాంకింగ్ సేవల్ని పూర్తిగా ఉచితంగా పొందవచ్చని ట్వీట్‌లో పేర్కొంది. మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లపై SMS ఛార్జీలు రద్దు చేయబడ్డాయి.. వినియోగదారులు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా సౌకర్యవంతంగా లావాదేవీలు జరుపుకోవచ్చని ట్వీట్ చేసింది. యూఎస్‌ఎస్‌డీ అంటే అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా అని అర్ధం. మొబైల్ నుంచి మనీ ట్రాన్స్ ఫర్, బ్యాంక్ అకౌంట్‌లో బ్యాలెన్స్ చెక్ చేయడం, బ్యాంక్ స్టేట్ మెంట్ జనరేట్ చేయడంతో పాటు ఇతర సేవల్ని ఈ USD ద్వారా వినియోగించుకోచ్చు. ఈ సర్వీస్ ఫీచర్ ఫోన్లపై పనిచేస్తుంది.
స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూజర్లు బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. *99# కోడ్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించడం ద్వారా స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఫండ్ ట్రాన్స్ ఫర్ లేదా అకౌంట్ స్టేట్ మెంట్‌తో పాటు ఇతర సేవల్ని వినియోగించుకునేందుకు ఖాతాదారులకు ఎస్‌బీఐ అనుమతిస్తుంది. ఎస్ బీఐ కొత్త నిర్ణయంతో ఖాతాదారులకు కొంత ఉపశమనం కలగనుంది.
SMS charges now waived off on mobile fund transfers! Users can now conveniently transact without any additional charges.#SBI #StateBankOfIndia #AmritMahotsav #FundTransfer pic.twitter.com/MRN1ysqjZU
— State Bank of India (@TheOfficialSBI) September 17, 2022
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..