DK Shivkumar: ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకే శివకుమార్‌.. నెట్టింట వీడియో వైరల్..

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇప్పటికే.. ఎలక్షన్ వేడి మొదలైంది. నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్లాన్ వేస్తున్న అధికార పార్టీ బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచించి ముందుకు సాగుతోంది.

DK Shivkumar: ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకే శివకుమార్‌.. నెట్టింట వీడియో వైరల్..
Dk Shivkumar
Follow us

|

Updated on: Mar 29, 2023 | 11:06 AM

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇప్పటికే.. ఎలక్షన్ వేడి మొదలైంది. నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్లాన్ వేస్తున్న అధికార పార్టీ బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచించి ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ ఓ ర్యాలీలో చేసిన పని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రజాధ్వని యాత్రలో డీకే శివకుమార్ డబ్బులు వెదజల్లారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మండ్య జిల్లాలో మంగళవారం ప్రజాధ్వని యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బేవినహళ్లిలో కార్యకర్తలు, ప్రజలకు కరెన్సీ నోట్లు వెదజల్లారు.

ఇది కాస్త విమర్శలకు దారితీసింది. కొద్దిరోజుల క్రితం మాజీ సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ కార్యకర్తను చెంపదెబ్బకొట్టిన వీడియో వైరల్‌ అయింది. ఈ క్రమంలోనే కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ నోట్లు విసరడం.. తలనొప్పిగా మారింది. మాండ్య జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శివకుమార్‌.. ప్రచార రథం పైనుంచి కింద ఉన్న ప్రజల పైకి రూ. 500 నోట్లు విసరడం వీడియోలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని శివకుమార్‌ ఇప్పటికే ప్రారంభించారు. కన్నడ రాజకీయాల్లో బలమైన నేతగా ఆయనకు మంచి పేరుండంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే సీఎం అభ్యర్థి రేసులో సిద్ధరామయ్య తోపాటు, శివకుమార్‌ పోటీలో ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. శివకుమార్ తీరుపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రచారంలో నోట్లు వెదజల్లడమేంటంటూ మండిపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..