AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: పెళ్లి చేసుకునేందుకు పిల్లనివ్వలేదని రెచ్చిపోయిన యువకుడు.. అర్థరాత్రి వేళ చొరబడి ఏం చేశాడంటే..

పెళ్లిడీకొచ్చాడు.. ఏం చేస్తారు.. అమ్మాయి కోసం వెతుకుతారు.. ఈడు జోడు కలిస్తే.. ఇద్దరికీ ముహూర్తం ఫిక్స్ చేసి పెళ్లి చేస్తారు.. ఒకవేళ పెళ్లి విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటారు.. కానీ, ఇక్కడ ఓ యువకుడు మాత్రం పెళ్లి కోసం రెచ్చిపోయి రచ్చ చేశాడు. రైతు ఎంతో కష్టపడి పండించిన పంటను క్షణాల్లో ధ్వంసం చేశాడు. అతని చర్యతో ఆ రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. ఇంతకీ ఆ యువకుడికి అంత అక్కసు ఎందుకు? ఎందుకలా పంటను ద్వంసం చేయాల్సి వచ్చింది? అసలేం జరిగిందో వివరాలు తెలుసుకుందాం..

Karnataka: పెళ్లి చేసుకునేందుకు పిల్లనివ్వలేదని రెచ్చిపోయిన యువకుడు.. అర్థరాత్రి వేళ చొరబడి ఏం చేశాడంటే..
Karnataka Boy
Shiva Prajapati
|

Updated on: Aug 10, 2023 | 3:09 PM

Share

పెళ్లిడీకొచ్చాడు.. ఏం చేస్తారు.. అమ్మాయి కోసం వెతుకుతారు.. ఈడు జోడు కలిస్తే.. ఇద్దరికీ ముహూర్తం ఫిక్స్ చేసి పెళ్లి చేస్తారు.. ఒకవేళ పెళ్లి విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటారు.. కానీ, ఇక్కడ ఓ యువకుడు మాత్రం పెళ్లి కోసం రెచ్చిపోయి రచ్చ చేశాడు. రైతు ఎంతో కష్టపడి పండించిన పంటను క్షణాల్లో ధ్వంసం చేశాడు. అతని చర్యతో ఆ రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. ఇంతకీ ఆ యువకుడికి అంత అక్కసు ఎందుకు? ఎందుకలా పంటను ద్వంసం చేయాల్సి వచ్చింది? అసలేం జరిగిందో వివరాలు తెలుసుకుందాం..

మైసూర్‌లోని హునాసూర్ తాలూకాలో కడే మనుగనహళ్లి గ్రామానికి చెందిన యువకుడు అశోక్.. అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే రైతు 3 ఎకరాల ‘వక్క’ పంటను ధ్వంసం చేశాడు. చేతికందివచ్చిన పంటను పూర్తిగా ధ్వంసం చేయడంతో ఆ రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అయితే, ఈ యువకుడు అలా చేయడానికి కారణం పెళ్లి అని చెబుతున్నారు స్థానికులు. అవును, వెంకటేష్‌కు ఓ కూతురు ఉంది. ఆమెను అశోక్‌కు ఇచ్చి పెళ్లి చేసేందుకు పరస్పరం చర్చలు కూడా జరిగాయి. అయితే, అబ్బాయి తీరు సరిగా లేదని పెళ్లికి అంగీకరించలేదు. అప్పటి నుంచి వెంకటేష్ కుటుంబంపై ధ్వేషం పెంచుకున్నాడు అశోక్.

ఈ వ్యవహారం కొన్నేళ్ల క్రితం చోటు చేసుకోగా.. అప్పటి నుంచి అశోక్‌కి వెంకటేష్ కుటుంబంపై ధ్వేషం తగ్గలేదు. ఈ నేపథ్యంలో గత రాత్రి వెంకటేష్ పొలం వద్దకు వెళ్లి.. 3 ఎకరాల్లో వేసిన వక్క పంటను పూర్తిగా నరికేశాడు. మరుసటి రోజు ఉదయం వెంకటేష్ తన పొలం వద్దకు వచ్చి చూడగా చెట్లన్నీ నేలకూలి ఉన్నాయి. వాటిని చూసి బోరున విలపించాడు వెంకటేష్. ఎవరు ఈ చర్యకు పాల్పడ్డారా? అని ఆరా తీయగా.. అశోక్ అని తేలింది. దాంతో హున్సూర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అశోక్‌పై ఫిర్యాదు చేశాడు వెంకటేష్. తన పంటను మొత్తం నాశనం చేశాడని కంప్లైంట్ ఇచ్చాడు. బాధితుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అశోక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాదాపు 3 ఎకరాల్లో 850 వక్క చెట్లను ధ్వసం చేసినట్లు తెలిపాడు బాధితులు. అయితే, అశోక్ గతంలోనూ ఇలాగే తన పంటను ధ్వంసం చేసినట్లు ఆరోపించాడు వెంకటేష్. తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయలేదనే అక్కసుతో గతంలో అర ఎకరంలో సాగు చేసిన అల్లం పంటను ధ్వంసం చేసినట్లు చెప్పాడు. ఇప్పుడు మళ్లీ వక్క పంటను ధ్వంసం చేశాడుని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..