Fake RC Number: నకిలీ నంబర్‌ ప్లేట్‌తో ఎమ్మెల్సీ కారునే అమ్మబోయిన పొలిటికల్ లీడర్.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ సీన్..

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఇటీవల నకిలీ నంబర్‌ ప్లేట్ల సమస్య పెరుగుతోంది. నకిలీ నంబర్ ప్లేట్ల బెడదతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, ఇదే అంశంపై ప్రతిరోజూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Fake RC Number: నకిలీ నంబర్‌ ప్లేట్‌తో ఎమ్మెల్సీ కారునే అమ్మబోయిన పొలిటికల్ లీడర్.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ సీన్..
Karnataka Mlc
Follow us

|

Updated on: Feb 26, 2023 | 3:01 PM

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఇటీవల నకిలీ నంబర్‌ ప్లేట్ల సమస్య పెరుగుతోంది. నకిలీ నంబర్ ప్లేట్ల బెడదతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, ఇదే అంశంపై ప్రతిరోజూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ సమస్య సాధారణ పౌరులే కాదు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా తాకింది. తాజాగా జేడీఎస్ ఎమ్మెల్సీ భోజేగౌడ కారు నంబర్‌ ప్లేట్‌‌తో నకిలీ నెంబర్ ప్లేట్ సృష్టించి విక్రయించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు బెంగళూరులో ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది. జేడీఎస్ ఎమ్మెల్సీ కారు కేసులో మరో జేడీఎస్ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు.

అసెంబ్లీ టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తున్న ఓ జేడీఎస్ నేత.. తన సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్సీ భోజెగౌడ కారు నంబర్‌ ప్లేట్‌ను కాపీ చేశాడు. అదే నెంబర్ ప్లేట్‌తో మరో కారును విక్రయించేందుకు ప్రయత్నించాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. జేడీఎస్ నేత షాబాజ్ వ్యవహారం బయటపడింది. దాంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. విచారణలో పలు కార్ల నెంబర్ ప్లేట్లను ఫోర్జరీ చేసి విక్రయించినట్లు తేలింది.

ఇదీ జరిగింది..

చిక్కమగళూరు జేడీఎస్ ఎమ్మెల్సీ భోజే గౌడ‌కు ఇన్నోవా క్రిస్టా కారు ఉంది. ఆ కారు నెంబర్ ప్లేట్ KA18 Z-5977. అయితే, ఈ నెంబర్ ప్లేట్‌ను మరొక ఇన్నోవా క్రిస్టా కారుకు సెట్ చేశారు. అలా ఆ కారును విక్రయించేందుకు ప్రయత్నించారు. క్వీన్ రోడ్‌లోని సెకండ్ హ్యాండ్ షోరూమ్‌లో అమ్మకానికి పెట్టారు. భోజేగౌడకు చెందిన పీఏ మాదేష్ క్వీన్ రోడ్డుకు వస్తుండగా షోరూం సమీపంలో ఇన్నోవా క్రిస్టా కారు కనిపించింది. కారును చూసి షోరూం సిబ్బందిని అది ఎమ్మెల్సీ భోజెగౌడ కారు కాదా అని అడిగాడు. తర్వాత భోజెగౌడకు ఫోన్ చేసి కారు అమ్ముతున్నావా అని అడిగితే భోజెగౌడ తన కారు ఇంటి దగ్గరే ఉందని సమాచారం ఇచ్చాడు. దాంతో కారు నెంబర్ ప్లేట్‌ను ఫోర్జరీ చేశారని గుర్తించిన ఎమ్మెల్సీ భోజెగౌడ పీఏ మాదేష్.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు రంగంలోకి దిగి చర్యలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..