Mysterious Deaths: ఒణుకు పుట్టిస్తోన్న మిస్టీరియస్ మరణాలు.. గంటల వ్యవధిలోనే 22 మంది మృతి! హై అలర్ట్ జారీ

పాకిస్థాన్‌లోని కరాచీలో ఆకస్మికంగా మరణిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 22కు చేరింది. గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు ఎక్కడపడితే అక్కడ దర్శనం ఇస్తుండటంతో అధికారులు షాక్‌ అవుతున్నారు. మంగళవారం నగరంలో 5 గుర్తు తెలియని మృతదేహాలను కనుగొన్నారు. దీంతో అక్కడ మిస్టీరియస్‌గా మృతి చెందుతున్న వారి సంఖ్య 22కి చేరింది. ఈ క్రమంలో..

Mysterious Deaths: ఒణుకు పుట్టిస్తోన్న మిస్టీరియస్ మరణాలు.. గంటల వ్యవధిలోనే 22 మంది మృతి! హై అలర్ట్ జారీ
Mysterious Deaths In Karachi
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 26, 2024 | 7:39 PM

కరాచీ, జూన్‌ 26: పాకిస్థాన్‌లోని కరాచీలో ఆకస్మికంగా మరణిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 22కు చేరింది. గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు ఎక్కడపడితే అక్కడ దర్శనం ఇస్తుండటంతో అధికారులు షాక్‌ అవుతున్నారు. మంగళవారం నగరంలో 5 గుర్తు తెలియని మృతదేహాలను కనుగొన్నారు. దీంతో అక్కడ మిస్టీరియస్‌గా మృతి చెందుతున్న వారి సంఖ్య 22కి చేరింది. ఈ క్రమంలో ఆ నగరంలో హై అలెర్ట్‌ ప్రకటించారు. దీంతో కరాచీలో అయోమయం నెలకొన్నది. ఈ మిస్టీరియస్ డెత్‌లపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

సంక్షేమ సంస్థ చిపా వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. తమ సంస్థ వాలంటీర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ చనిపోయిన ఆ 22 మంది ఎవరన్నది గుర్తించలేకపోయమని చిపా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఇప్పటికే వరకు ఒక్క మృతదేహం గుర్తింపును కూడా నిర్ధారించలేకపోయామన్నారు. చిపా వెల్ఫేర్ అసోసియేషన్ అనేది కరాచీలో అంబులెన్స్‌ల నెట్‌వర్క్‌ను నడుపుతున్న ప్రైవేట్ సంస్థ. బంధువులెవరూ స్వీకరించడానికి రాకపోవడంతో సుమారు 22 మంది మృతదేహాలు తమ వద్దనే ఉన్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే మరోవైపు కరాచీలో ఎండల తీవ్రతకు అనేక మంది వడ దెబ్బ బారీన పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది హీట్‌స్ట్రోక్ కారణంగా పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరాచీలో లభ్యమైన మృతదేహాల్లో చాలా మంది డ్రగ్స్‌ బానిసలని, డ్రగ్స్ మత్తులో ఉన్న వీరంతా ఎంత తీవ్రత కారణంగా మరణించి ఉంటారని ఈధి ఫౌండేషన్‌కు చెందిన అజీమ్ ఖాన్ అనే వ్యక్తి తెలిపారు. కరాచీలో ఓ వృద్ధుడు బహిరంగంగా డ్రగ్స్ వినియోగిస్తున్న యువకులను అడ్డుకోవడంతో.. వారంతా అతన్ని చావగొట్టారు. పాకిస్తాన్‌లో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి ఈ ఘటన నిదర్శనం. ముఖ్యంగా ఇటీవల కాలంలో అక్కడ ‘క్రిస్టల్ మెథాంఫేటమిన్’ అనే ఐస్ వాడకం విపరీతంగా పెరుగుతోంది. ఇది ఒకరకమైన మత్తు పదార్ధం. పాకిస్థాన్‌లో దీని వాడకం యువతలో మరింత పెరుగుతుంది. ఇతర డ్రగ్స్‌తో పోల్చితే దీని ధర తక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.