AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emergency: కాంగ్రెస్‌ మూల సిద్ధాంతం అదే.. లోక్ ‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం అభినందనీయం.. ప్రధాని మోదీ, యోగి ఏమన్నారంటే..

స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టగానే ఓంబిర్లా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇందిరాగాందీ హయాంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సభలో ఆవిషయాన్ని ప్రస్తావించారు. ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్‌ ప్రజల హక్కులను హరించిందని , దేశాన్ని జైలుగా మార్చేశారని వ్యాఖ్యానించారు ఓంబిర్లా.

Emergency: కాంగ్రెస్‌ మూల సిద్ధాంతం అదే.. లోక్ ‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం అభినందనీయం.. ప్రధాని మోదీ, యోగి ఏమన్నారంటే..
Pm Modi Om Birla Yogi Adityanath
Shaik Madar Saheb
|

Updated on: Jun 26, 2024 | 7:10 PM

Share

లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా చిత్ర విచిత్రమైన సన్నివేశాలు కన్పించాయి. అధికార , విపక్షాల మధ్య స్నేహం కుదిరినట్టు కుదిరి బెడిసి కొట్టింది. లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా చిత్ర విచిత్రమైన సన్నివేశాలు కన్పించాయి. అధికార , విపక్షాల మధ్య స్నేహం కుదిరినట్టు కుదిరి బెడిసి కొట్టింది. లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రధాని మోదీ.. NDA పక్షాల తరపున ఓం బిర్లా అభ్యర్థిగా తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే.. INDIA కూటమి తరపున కాంగ్రెస్.. కే.సురేష్‌ని అభ్యర్థిగా నిలబెట్టగా.. మూజువాణి ఓటుతో.. ఓం బిర్లా మళ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. కాగా.. స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టగానే ఓంబిర్లా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇందిరాగాందీ హయాంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సభలో ఆవిషయాన్ని ప్రస్తావించారు. ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్‌ ప్రజల హక్కులను హరించిందని , దేశాన్ని జైలుగా మార్చేశారని వ్యాఖ్యానించారు ఓంబిర్లా. అయితే స్పీకర్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు కాంగ్రెస్‌ సభ్యులు. తీవ్ర గందరగోళం మధ్య సభ రేపటికి వాయిదా పడింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పార్లమెంట్‌ ప్రధాన ద్వారం మకరధ్వజ్‌ దగ్గర బీజేపీ ఎంపీలు నిరసన తెలిపారు.

ప్రధాని మోదీ ప్రశంసలు..

లోక్‌సభలో ఎమర్జెన్సీ అంశాన్ని ప్రస్తావించినందుకు స్పీకర్‌ ఓంబిర్లాపై ప్రశంసల జల్లులు కురిపించారు ప్రధాని మోదీ. ప్రజాస్వామ్యం గొంతు నొక్కిన విషయాన్ని స్పీకర్‌ చక్కగా వివరించారని అన్నారు. స్పీకర్ ఎమర్జెన్సీని తీవ్రంగా ఖండించినందుకు, ఆ సమయంలో చేసిన దుశ్చర్యలను ఎత్తిచూపినందుకు.. ప్రజాస్వామ్యం గొంతు నొక్కిన తీరును ప్రస్తావించినందుకు తాను సంతోషిస్తున్నానన్నారు. ఆ రోజుల్లో బాధపడ్డ వారందరికీ గౌరవంగా మౌనంగా నిలబడడం కూడా ఒక అద్భుతమైన విషయమన్నారు. 50 సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ విధించారని.. అయితే నేటి యువత దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఎందుకంటే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, ప్రజాభిప్రాయాన్ని అణిచివేసినప్పుడు.. సంస్థలను నాశనం చేసినప్పుడు ఏమి జరుగుతుందో దానికి తగిన ఉదాహరణగా మిగిలిపోయిందన్నారు. నియంతృత్వం ఎలా ఉంటుందో ఎమర్జెన్సీ సమయంలో జరిగిన సంఘటనలు ఉదహరించాయంటూ మోదీ పేర్కొన్నారు.

ఇది చారిత్రాత్మకమైన రోజు.. సీఎం యోగి ఆదిత్యనాథ్..

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన తీర్మానంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మకమైన రోజు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు సభలో ఎమర్జెన్సీని ఖండిస్తూ తీర్మానం చేశారన్నారు. కాంగ్రెస్ ఎంపీలు రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రమాణం చెయ్యడం విడ్డూరం:.. రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా అధికారం కోసం ఎమర్జెన్సీ విధించిన వ్యక్తే ఇందిర గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మారొచ్చుగానీ, కాంగ్రెస్‌ మూల సిద్ధాంతం మాత్రం అదేనన్నారు. 75ఏళ్లలో 75సార్లు రాజకీయ సవరణలు చేసిన పార్టీ కాంగ్రెస్.. అని ఇవాళ లోక్‌సభలో స్పీకర్ బిర్లా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్మానం పెట్టడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ తీరుపై స్పీకర్ ప్రజలను అప్రమత్తం చేశారంటూ యోగి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..