K R Gouri: కేరళ తొలి రెవెన్యూ మంత్రి కేఆర్ గౌరీ అమ్మ (102) కన్నుమూత..11 సార్లు అసెంబ్లీకి ఎన్నిక
K R Gouri: కేరళ రాష్ట్ర తొలి రెవెన్యూ శఖ మంత్రి, కమ్యూనిస్ట్ నాయకురాలు కేఆర్ గౌరీ అమ్మ (102) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆమె ఆస్పత్రిలో చేరగా, తీవ్రమైన ఇన్‌ఫెక్షన్..
K R Gouri: కేరళ రాష్ట్ర తొలి రెవెన్యూ శఖ మంత్రి, కమ్యూనిస్ట్ నాయకురాలు కేఆర్ గౌరీ అమ్మ (102) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆమె ఆస్పత్రిలో చేరగా, తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ కారణంగా పరిస్థితి విషమించడంతో ఆమె మరణించారు. అయితే ఆమె వారం రోజుల కిందటనే ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, మూత్ర సంబంధిత వ్యాధులతో తిరువనంతపురంలోని పీఆర్‌ఎస్ ఆస్పత్రిలో చేరారు.
న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్
గౌరీ అమ్మ జూలై 14,1919లో అలప్పుజ జిల్లాలోని చెర్తాలలో అరుమురి పరంబిల్ పార్వతి అమ్మ, కలతిల్పరంబిల్ రామన్ దంపతులకు జన్మించారు. ఆమె తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేరళలోని ఈజావా వర్గానికి చెందిన మొదటి మహిళా న్యాయ విద్యార్థిని కూడా గౌరీ అమ్మనే. 2019లో ఆమె 100వ పుట్టిన రోజును జరుపుకున్నారు.
1957లో రెవెన్యూ మంత్రిగా..
కేరళలో 1957లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలోని మొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో ఆమె రెవెన్యూ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక నాయకుల్లోనూ ఒకరు. మంత్రిగా భూ సంస్కరణల బిల్లును తీసుకువచ్చారు. అనంతరం ఆమె వివిధ ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో సేవలందించారు. 1964లో కమ్యూనిస్ట్ పార్టీ విడిపోయినప్పుడు ఆమె సీపీఐ(ఎం)లో చేరారు. 1987 ఎన్నికల్లో గెలుపొందిన గౌరీ అమ్మకు కేరళకు తొలి మహిళా ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం రాగా.. రాజకీయాల కారణంగా తప్పుకున్నారు. ఆమె 11 సార్లు కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
జనతిపతియా సంరక్షణ సమితి పార్టీ స్థాపన
కాగా, ఆమె 1994లో పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. దీతో జనతిపతియా సంరక్షణ (జేఎస్‌ఎస్) సమితి పార్టీని స్థాపించారు. 1994లో పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ క్రమంలో గౌరీ అమ్మ యూడీఎఫ్‌లో విలీనం చేసి.. పార్టీ ప్రభుత్వంలో మరోసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆమె చివరిసారిగా 2011లో ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు.