Pulitzer Award: దివంగత జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీకి పులిట్జర్ అవార్డు.. లిస్టులో మరో ముగ్గురు భారతీయులు..
రాయిటర్స్ వార్త సంస్థకు చెందిన సిద్దిఖీ, అతడి సహోద్యోగులు అద్నాన్ ఆబిది, సన్నా ఇర్షాద్, అమిత్ దేవ్‌లు పులిట్జర్ అవార్డును ఫీచర్ ఫోటోగ్రఫీ విభాగంలో గెలుచుకున్నారు..
ఆఫ్గనిస్తాన్ పేలుళ్లలో మృతిచెందిన ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ దివంగత డానిష్ సిద్దిఖీకి ప్రతిష్టాత్మక పులిట్జర్(Pulitzer) అవార్డు 2022 దక్కింది. భారతదేశంలో కోవిడ్ పరిస్థితులను కవర్ చేసినందుకు గానూ అతడ్ని ఈ అవార్డుతో సత్కరిస్తున్నట్లు పులిట్జర్ అవార్డుల వెబ్‌సైట్ పేర్కొంది. రాయిటర్స్ వార్త సంస్థకు చెందిన సిద్దిఖీ, అతడి సహోద్యోగులు అద్నాన్ ఆబిది, సన్నా ఇర్షాద్, అమిత్ దేవ్‌లు పులిట్జర్ అవార్డును ఫీచర్ ఫోటోగ్రఫీ విభాగంలో గెలుచుకున్నారు.
38 ఏళ్ల సిద్ధిఖీ గతేడాది ఆఫ్ఘనిస్తాన్‌లోని పరిస్థితులను కవర్ చేస్తుండగా మృతి చెందాడు. సిద్దిఖీ పులిట్జర్ అవార్డు గెలవడం ఇది రెండోసారి. 2018లో రోహింగ్యా సంక్షోభంపై విస్తృతంగా కవర్ చేసినందుకు సిద్దిఖీ మొదటిసారి ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇండియాలోని రాయిటర్స్ సంస్థలో చీఫ్ ఫోటోగ్రాఫర్‌గా పని చేసిన సిద్ధిఖీ.. ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశాడు.
అలాగే అదే కాలేజీ నుంచి మాస్ కమ్యూనికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేశాడు. కాగా, ఫోటో జర్నలిస్ట్‌గా, డానిష్ సిద్ధిఖీ ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల సమస్యలను విస్తృతంగా కవర్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌లోని యుద్ధాలు, రోహింగ్యా శరణార్థుల సంక్షోభం, హాంకాంగ్ నిరసనలు, నేపాల్ భూకంపాలు వంటివి అతను చేసిన వాటిల్లో ప్రధానమైనవి.
పులిట్జర్ అవార్డులు జాబితా..
-
ప్రజా సేవ – వాషింగ్టన్ పోస్ట్
-
బ్రేకింగ్ న్యూస్ రిపోర్టింగ్- మియామి హెరాల్డ్ సిబ్బంది
-
పరిశోధనాత్మక రిపోర్టింగ్- టంపా బే టైమ్స్‌కు చెందిన కోరీ జి. జాన్సన్, రెబెక్కా వూలింగ్‌టన్, ఎలి ముర్రే
-
వివరణాత్మక రిపోర్టింగ్- క్వాంటా మ్యాగజైన్, నటాలీ వోల్చోవర్.
-
స్థానిక రిపోర్టింగ్- బెటర్ గవర్నమెంట్ అసోసియేషన్‌కు చెందిన మాడిసన్ హాప్‌కిన్స్, చికాగో ట్రిబ్యూన్‌కు చెందిన సిసిలియా రెయెస్.
-
నేషనల్ రిపోర్టింగ్- న్యూయార్క్ టైమ్స్
-
అంతర్జాతీయ రిపోర్టింగ్- న్యూయార్క్ టైమ్స్
-
ఫీచర్ రైటింగ్- ది అట్లాంటిక్‌కి చెందిన జెన్నిఫర్ సీనియర్
-
వ్యాఖ్యానం- కాన్సాస్ సిటీ స్టార్, మెలిండా హెన్నెబెర్గర్
-
విమర్శ- సలామిషా టిల్లెట్
-
సంపాదకీయ రచన- హ్యూస్టన్ క్రానికల్‌కు చెందిన లిసా ఫాల్కెన్‌బర్గ్, మైఖేల్ లిండెన్‌బెర్గర్, జో హోలీ, లూయిస్ కరాస్కో
-
ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్, వ్యాఖ్యానం- ఇన్‌సైడర్‌కి చెందిన ఫహ్మిదా అజీమ్, ఆంథోనీ డెల్ కల్, జోష్ ఆడమ్స్, వాల్ట్ హికీ.
-
బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీ – మార్కస్ యామ్, జోన్ చెర్రీ
-
ఫీచర్ ఫోటోగ్రఫీ- అద్నాన్ అబిది, సన్నా ఇర్షాద్ మట్టూ, అమిత్ డేవ్, దివంగత డానిష్ సిద్ధిఖీ.
-
ఆడియో రిపోర్టింగ్- ఫ్యూచురో మీడియా, PRX సిబ్బంది
Also Read:
Viral Photo: మీ కళ్లకి ఓ పరీక్ష.. ఈ ఫోటోలోని నెంబర్‌ను కనిపెడితే మీరు జీనియసే.. ట్రై చేయండి!
Viral Video: కర్మఫలం అంటే ఇదేనేమో! రోడ్డుపై వెకిలి చేష్టలు చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటది.. చూస్తే షాకే!