Viral Video: కర్మఫలం అంటే ఇదేనేమో! రోడ్డుపై వెకిలి చేష్టలు చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటది.. చూస్తే షాకే!

Viral Video: కర్మ ఈజ్ ఏ బూమరాంగ్.. 'ఎవరు చేసిన కర్మఫలం.. వారు ఎప్పటికైనా అనుభవించక మానరు' అని పెద్దలు చెబుతుంటారు...

Viral Video: కర్మఫలం అంటే ఇదేనేమో! రోడ్డుపై వెకిలి చేష్టలు చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటది.. చూస్తే షాకే!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: May 09, 2022 | 12:58 PM

కర్మ ఈజ్ ఏ బూమరాంగ్.. ‘ఎవరు చేసిన కర్మఫలం.. వారు ఎప్పటికైనా ఫలితం అనుభవించక మానరు’ అని పెద్దలు చెబుతుంటారు. ఈ వీడియో చూస్తే తప్పకుండా మీరూ అవునని అంటారు. రోడ్డుపై ఓ పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని.. బండిపై వచ్చిన ముగ్గురు వ్యక్తులలో ఒకరు తల మీద కొట్టారు.. అంతే! వారి కర్మఫలం బూమరాంగ్‌లా ఠక్కున రిటర్న్ వచ్చింది.. బైక్‌పై నుంచి బొక్కబోర్లాపడ్డారు. ఈ వీడియో చూసినవాళ్లంతా ఎవరి కర్మను వారనుభవించక తప్పదు అని కామెంట్ చేస్తున్నారు.

ఈ వీడియోను ‘jatt_brand-mehkma’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసింది. వీడియోను మీరు చూసినట్లయితే.. రోడ్డు ప్రక్కన ఓ వ్యక్తి ఎంచక్కా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో అతడ్ని వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు తలపై కొట్టాడు. అంతే.! దెబ్బకు కర్మఫలం బూమరాంగ్‌లా తిరిగొచ్చింది. బైక్ అదుపు తప్పింది. వారందరూ బొక్కబోర్లాపడ్డారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 5 లక్షలకు పైగా వ్యూస్ రాగా… నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Also Read: Viral: అట్లుంటది ముచ్చట మనతోని.. డీజేతో పోలీసులనే బ్రేక్ డ్యాన్స్ చేయించాడు.. చూస్తే మైండ్ బ్లాకే!