AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job fraud: ఆశ్రమానికి వచ్చే విద్యార్థులకు ఉద్యోగాల పేరిట టోకరా.. కేంద్ర మంత్రి పీఏ అంటూ ఘరానా మోసం!

ఓ ఆశ్రమానికి భక్తుడిగా వెళ్తూ, అక్కడ అందరికీ తనను తాను కేంద్ర మంత్రి పీఏగా, మాజీ మంత్రి రఘునాథ్ మొహంతి మేనల్లుడుగా పరిచయం చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడో ప్రబుద్ధుడు. అదీ అన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావడంతో ఎగబడి మరీ 60 లక్షల వరకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయిన ఇండియన్ రైల్వేస్ అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ - ఐఓసీఎల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురి యువకులను 60 లక్షలకు పైగా మోసం చేసిన..

Job fraud: ఆశ్రమానికి వచ్చే విద్యార్థులకు ఉద్యోగాల పేరిట టోకరా.. కేంద్ర మంత్రి పీఏ అంటూ ఘరానా మోసం!
Man Arrested For Cheating Job Seekers
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Nov 13, 2023 | 4:31 PM

Share

కటక్, నవంబర్ 13: ఓ ఆశ్రమానికి భక్తుడిగా వెళ్తూ, అక్కడ అందరికీ తనను తాను కేంద్ర మంత్రి పీఏగా, మాజీ మంత్రి రఘునాథ్ మొహంతి మేనల్లుడుగా పరిచయం చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడో ప్రబుద్ధుడు. అదీ అన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావడంతో ఎగబడి మరీ 60 లక్షల వరకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయిన ఇండియన్ రైల్వేస్ అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ – ఐఓసీఎల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురి యువకులను 60 లక్షలకు పైగా మోసం చేసిన వ్యక్తిని కటక్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

ఒడిస్సాలోని బాలాసోర్ జిల్లాలోని బలియాపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలరామ్ నగర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన సంతోష్ మహూరి అలియాస్ సంతోష్ మొహంతి ఈ మోసాలకు పాల్పడ్డట్టు గుర్తించారు. బరంగా పరిధిలోని త్రిసూలియాలో పరిధిలోని బ్రాహ్మణిగావ్ కు చెందిన నరేంద్ర సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు.

చింతామణి పరిదా ఆశ్రమ భక్తుడిగా ….

నరేంద్ర సింగ్ ఫిర్యాదు లో వెల్లడించిన వివరాల ప్రకారం.. సంతోష్ మహూరి త్రిసూలియా గ్రామం లోని దర్ఘాపట్న హనుమాన్ బాబా – చింతామణి పరిదా ఆశ్రమానికి నివాసానికి తరచూ వెళ్లేవాడు. అక్కడ అందరికీ సంతోష్ తనను తాను కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పీఏగా, మాజీ మంత్రి రఘునాథ్ మొహంతి మేనల్లుడుగా పరిచయం చేసుకున్నాడు. కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పీఏగా, మాజీ మంత్రి రఘునాథ్ మొహంతి మేనల్లుడుగా పరిచయం చేసుకోవడం తో అందరూ సంతోష్ మోహూరి తో పరిచయం కోసం ఎగబడ్డారు. అదే క్రమంలో ఏప్రిల్లో తన కొడుకు, బంధువులకు ఇండియన్ రైల్వే, ఐఓసీఎల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని హనుమాన్ బాబాకు సంతోష్ చెప్పాడు. దీంతో హనుమాన్ బాబా తన సన్నిహితులను కూడా సంతోష్ కు పరిచయం చేసి ఉద్యోగాల గురించి వారందరికీ వివరించాడు. అదే సమయంలో సంతోష్ ను అందరూ నమ్మడం, ఆయన ఉద్దేశ్యాన్ని ఎవరూ అనుమానించకపోవడం తో పలువురు అనేక లావాదేవీల ద్వారా సంతోష్ అకౌంట్ కు 60 లక్షల రూపాయలను బదిలీ చేశారు.

ఇవి కూడా చదవండి

నకిలీ అపాయింట్మెంట్ ఇచ్చి మరీ మోసం

ఉద్యోగం కోసం డబ్బులు ఇచ్చిన సంతోష్ బాధితుల్లో ఒకరికి నకిలీ సెలక్షన్ రైల్వే జాబితాను పంపి, త్వరలోనే అపాయింట్మెంట్ లెటర్స్ అందజేస్తానని హామీ ఇచ్చాడు సంతోష్. అలానే నకిలీ అపోఇంట్మెంట్ కూడా ఇచ్చేశాడు. అదే సమయం లో బాధితులకు అపాయింట్మెంట్ లెటర్ రాకపోవడంతో సంతోష్ ను ఫోన్ల సంప్రదించేందుకు ప్రయత్నించారు డబ్బులు ఇచ్చిన బాధితులు. అయితే ఎవరి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోకపోవడమే కాకుండా మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో నరేంద్ర కటక్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేంద్ర ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు విస్తు పోయే నిజాలు తెలిసాయి. సంతోష్ తనను తాను పిఎ గా పరిచయం చేసుకుని మంత్రికి పీఏ, రక్షణ సిబ్బందికి వ్యక్తి గత సలహాదారు, డిఆర్డిఓ ఉద్యోగి వంటి విభిన్న గుర్తింపులతో బాధితులకు పరిచయం చేసుకున్నట్టు గుర్తించారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు ఇప్పించడానికి, వారిని ఒప్పించేందుకు ఉన్నత స్థాయిలో తన ప్రభావాన్ని చెప్పుకున్నాడని కూడా పోలీసులు నిర్ధారించారు.

సంతోష్ మొహూర్ నుంచి ల్యాప్టాప్, వివిధ మోడల్స్కు చెందిన 8 మొబైల్ ఫోన్లు, 13 సిమ్కార్డులు, ఒక హార్డ్ డ్రైవ్, రెండు పెన్ద్రవ్లు, వివిధ బ్యాంకులకు చెందిన 5 పాస్బుక్లు, 5 చెక్ బుక్ లు, 18 డెబిట్ కార్డులు, రెండు పాన్ కార్డులు, ఒక ఆధార్ కార్డు, ఒక గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, DRDO, విజిలెన్స్ విభాగానికి చెందిన రెండు నకిలీ సర్టిఫికేట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

మరిన్నిజాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us