AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణం పోతుందంటే సాయం చేసిన డాక్టర్.. ఇంతలోనే ఊహించని షాక్!

జార్ఖండ్ రాజధాని నగరంలో దారుణం వెలుగు చూసింది. రాంచీలోని ఒక గ్రామంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. గ్రామీణ వైద్యుడిగా పనిచేస్తున్న ఒకరిని గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

ప్రాణం పోతుందంటే సాయం చేసిన డాక్టర్.. ఇంతలోనే ఊహించని షాక్!
Doctor Murdered
Balaraju Goud
|

Updated on: Nov 09, 2025 | 5:28 PM

Share

జార్ఖండ్ రాజధాని నగరంలో దారుణం వెలుగు చూసింది. రాంచీలోని ఒక గ్రామంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. గ్రామీణ వైద్యుడిగా పనిచేస్తున్న ఒకరిని గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం పంపారు.

బుధ్ము పోలీస్ స్టేషన్ పరిధిలోని మట్వే గ్రామంలో ఆదివారం (నవంబర్ 9) ఉదయం గ్రామ వైద్యుడు సపన్ దాస్ గొంతు కోసి హత్య చేయడం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. సుమారు ఐదు సంవత్సరాలుగా గ్రామ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. స్థానిక గ్రామస్తులకు బెంగాలీ వైద్యుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఆదివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు వైద్య చికిత్స అందించే నెపంతో సపన్ దాస్ ఇంటికి వచ్చారు. ఇంతలోనే వారు సపన్ దాస్‌ను పట్టుకుని పదునైన ఆయుధంతో అతని గొంతు కోశారు. ఈ దాడిలో వైద్యుడు తీవ్ర రక్తస్రావం కావడంతో, అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, బుద్ము పోలీస్ స్టేషన్ సంఘటనా స్థలానికి చేరుకుని, రక్తంతో తడిసిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపారు.

గ్రామస్తుల సహకారంతో, హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. రెండవ నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసు స్థానిక పోలీసులకు, గ్రామంలో మిస్టరీగా మారిపోయింది. హత్య వెనుక గల ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి అరెస్టు చేసిన నిందితుడిని ప్రస్తుతం విచారిస్తున్నారు.

బుధ్ము పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఈ హత్యకు కేవలం 12 గంటల ముందు, రాంచీలోని నగరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్చోరో గ్రామంలోని రైల్వే క్రాసింగ్ సమీపంలో మరో దారుణం చోటు చేసుకుంది. అప్పటికే అక్కడ వేచి ఉన్న నేరస్థులు పని ముగించుకుని స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తున్న మనీషా టిర్కీ అనే యువతిని కాల్చి చంపారు. తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే మెరుగైన చికిత్స కోసం రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు టెక్నికల్ సెల్ సహాయంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాల్పుల్లో పాల్గొన్న నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us