AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచి.. తుపాకీతో కాల్చిన ఇద్దరు విద్యార్థులు! ఆ తర్వాత సీన్ ఇదే..

గతంలో జరిగిన ఓ గొడవ నేపథ్యంలో ఇద్దరు విద్యార్ధులు తమ క్లాస్‌మేట్‌ అయిన మరో విద్యార్ధిపై కక్ష్య పెట్టుకున్నారు. అతడిని ఎలాగైనా చంపాలని భావించిన ఆ ఇద్దరు విద్యార్ధులు క్లాస్‌మెట్ను నమ్మకంగా ఇంటికి రప్పించి.. తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన..

ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచి.. తుపాకీతో కాల్చిన ఇద్దరు విద్యార్థులు! ఆ తర్వాత సీన్ ఇదే..
Class 11 Students Held For Shooting At Classmate
Srilakshmi C
|

Updated on: Nov 09, 2025 | 5:48 PM

Share

గురుగ్రామ్‌, నవంబర్‌ 9: గతంలో జరిగిన ఓ గొడవ నేపథ్యంలో ఇద్దరు విద్యార్ధులు తమ క్లాస్‌మేట్‌ అయిన మరో విద్యార్ధిపై కక్ష్య పెట్టుకున్నారు. అతడిని ఎలాగైనా చంపాలని భావించిన ఆ ఇద్దరు విద్యార్ధులు క్లాస్‌మెట్ను నమ్మకంగా ఇంటికి రప్పించి.. తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్ధి ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బాదిత విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ షాకింగ్‌ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో శనివారం చోటు చేసుకోగా ఆదివారం (నవంబర్‌ 9) వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..

గురుగ్రామ్‌లోని సెక్టార్ 48లోని విలాసవంతమైన హౌసింగ్ సొసైటీ అయిన సెంట్రల్ పార్క్ రిసార్ట్స్‌లో నివసిస్తున్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు కొందరు స్థానిక ప్రైవేట్‌ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్నారు. శనివారం రాత్రి 17 ఏళ్ల వయసున్న క్లాస్‌మేట్‌ను అదే తరగతికి చెందిన విద్యార్థి తన ఇంటికి తీసుకెళ్లాడు. అదే అపార్ట్‌మెంట్‌లో ఉన్న మరో స్టూడెంట్‌ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు విద్యార్ధులు కలిసి ఇంట్లో తండ్రికి చెందిన లైసెన్స్ తుపాకీతో క్లాస్‌మెట్‌పై కాల్పులు జరిపారు. బుల్లెట్ల గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న బాదిత బాలుడిని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బాదిత బాలుడి తల్లి పోలీసులకు సమాచారం అందించడంతో వారు అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. సంఘటనా స్థలంలో కాల్పులకు వినియోగించిన పిస్టల్‌, ఓ మ్యాగజైన్, ఐదు లైవ్ కార్ట్రిడ్జ్‌లు, ఒక ఖాళీ షెల్, 65 లైవ్ కార్ట్రిడ్జ్‌లతో కూడిన మరో మ్యాగజైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులైన ఇద్దరు విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఓ పోలీస్‌ అధికారి వెల్లడించారు. నిందిత విద్యార్ధులు ఇద్దరూ బాదిత విద్యార్ధి ఇంటికి వెళ్లి, అతడి తల్లిని బతిమిలాడి మరీ బాలుడిని తమతోపాటు అపార్ట్‌మెంట్కు తీసుకెళ్లారని, గతంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో నిందిత విద్యార్ధులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు తమ లైసెన్స్ పొందిన ఆయుధాలను సురక్షితంగా, పిల్లలకు అందుబాటులో లేకుండా ఉంచాలని గురుగ్రామ్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us