Business Idea: ఈ పంట వేస్తే ఏడాది అంతా మీ పంట పండినట్లే.. 30 ఏళ్ల పాటు లక్షల్లో ఆదాయం!
ప్రతి రైతు తను వేసే పంట తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆధాయం ఇవ్వాలని అనుకుంటాడు. ఇది కొన్ని సార్లు సాధ్యం అయినా, కొన్ని సార్లు కాదు. అయితే మేము ఇప్పుడు మీకు చెప్పబోయే పంట మాత్రం తక్కవ పెట్టుబడి, అది కూడా ఒక్క సారి పెడితే దాదాపు 30 ఏళ్ల వరకు మీకు ఆధాయాలను తెచ్చి పెడుతూనే ఉంటుంది. ఇంతకు ఆ పంట ఏంటనే కదా మీ డౌట్ తెలుసుకుందాం పదండి.

తక్కువ పెట్టుబడితో ఎక్కవ ఆధాయాలను అందించే పంటలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఉసిరి కూడా ఒకటి. రాజస్థాన్‌లోని పుష్కర్ ప్రాంతంలో రైతులు ఉసిరిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ పంట చాలా లాభదాయకమైన పంటగా అవతరించింది. పుష్కర్‌లోని సారవంతమైన నేల, వాతావరణం ఈ సాగుకు అనుకూలంగా ఉండటంతో, రైతులు సాంప్రదాయ పంటలకు దూరంగా ఉసిరి తోటలను ఏర్పాటు చేసుకున్నారు.
30 ఏళ్ల వరకు ఆధాయం
ఈ పంటను ఒకసారి నాటిన తర్వాత 25 నుండి 30 సంవత్సరాల వరకు ఫలాలను ఇస్తుంది. ఇది రైతులకు దీర్ఘకాలిక స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది.ఈ పంటను పండించేందుకు మీరు ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు. వీటి పెంపకానికి ఎక్కువ నీరు కూడా లేదా అవసరం లేదు. మీరు మొదట్లో పంటను వేసేటప్పడు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే చాలా. ఇది మీకు 30 ఏళ్ల వరకు లాభాలను తెచ్చిపెడుతుంది.
ఏడాది పొడవునా డిమాండ్
ఈ పంటకు ఉన్న ప్రధాన ఆకర్షణ ఏమిటంటే దీని పండ్లకు ఏడాది పొడవునా మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. రసం, జామ్, మిఠాయి, పొడి మొదలైన వివిధ ఉత్పత్తులో ఈ ఉసిరిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కాబట్టి వీటికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇది రైతులకు అదనపు లాభాన్ని అందిస్తుంది. బిందు సేద్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాల సహాయంతో, పుష్కర్‌లోని రైతులు తమ ఉత్పత్తిని పెంచారు. తక్కువ శ్రమ, దీర్ఘకాలిక పండ్లు, స్థిరమైన డిమాండ్ కారణంగా ఈ పంట నేడు చాలా మంది రైతులకు ఆదాయ వనరుగా మారింది.
నాటడం: జూలై-సెప్టెంబర్ లేదా జనవరి-ఫిబ్రవరి నెలల్లో సాగు చేయవచ్చు. మొక్కలు నాటడానికి ముందుగా గుంతలు తవ్వాలి. 1×1 మీ లేదా 1.25 x 1.25 మీ కొలతలు గల గుంతలను 6 x 6 మీటర్ల దూరంతో నాటాలి.
వాతావరణం: ఉసిరి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. పూత సమయంలో అధిక ఉష్ణోగ్రత, కాయలు పెరిగేటప్పుడు గాలిలో తేమ అవసరం. సాగు పద్ధతులు
నీటిపారుదల: బిందు సేద్యం ఉత్తమమైన పద్ధతి, ఇది 40-45% వరకు నీటిని ఆదా చేస్తుంది. వర్షాకాలం, శీతాకాలంలో నీటిపారుదల అవసరం ఉండదు.
కత్తిరింపు: మొక్కల పెరుగుదలకు, ఆరోగ్యానికి శిక్షణ, కత్తిరింపు అవసరం. డిసెంబర్ చివరిలో అనవసర కొమ్మలు, వ్యాధిగ్రస్తులైన కొమ్మలు, సక్కర్లను కత్తిరించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




