UP IT Rides: యూపీలో మళ్ళీ ఐటీ దాడుల కలకలం.. ఈసారీ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఇంటిలో..

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో మరో పెర్ఫ్యూమ్ వ్యాపారి ఇంటిపై శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ వ్యాపారి పేరు పుష్పరాజ్ జైన్ పంపి. సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు.

UP IT Rides: యూపీలో మళ్ళీ ఐటీ దాడుల కలకలం.. ఈసారీ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఇంటిలో..
Pushpa Raj Jain Pampi
KVD Varma

|

Dec 31, 2021 | 11:04 AM

UP IT Rides: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో మరో పెర్ఫ్యూమ్ వ్యాపారి ఇంటిపై శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ వ్యాపారి పేరు పుష్పరాజ్ జైన్ పంపి. సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అయన 2022 కోసం 22 పువ్వులతో తయారు చేసిన సమాజ్‌వాదీ పెర్ఫ్యూం విడుదల చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇంకా ఆయన ఇంటిలో సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు.

పుష్పరాజ్ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు సన్నిహితుడు.. పార్టీకి పెద్ద ఫైనాన్షియర్ అని చెబుతున్నారు. పీయూష్ జైన్ పై ఐటీ దాడుల తరువాత జరుగుతున్న ఈ దాడి ప్రస్తుతం సంచలనం గా నిలిచింది. పుష్పరాజ్ జైన్ ఇల్లు కూడా పీయూష్ జైన్ ఇంటికి కొద్ది దూరంలోనే ఉంది. ఈయన నిత్యం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యేవాడు. ఇది కాకుండా, కన్నౌజ్‌లోని మరో పెర్ఫ్యూమ్ వ్యాపారి మాలిక్ మియాన్ ఆవరణలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. గత సారి కూడా పుష్పరాజ్ రహస్య స్థావరాలపైనె ఐటీ శాఖ దాడులు చేసేందుకు సిద్ధమైంది. అప్పుడు రహస్య సంకేతంగా పి కోసం బృందం వెతుకులాట మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఐటీ టీమ్ అనుకోకుండా పీ అంటే పుష్పరాజ్ బదులు పీ అంటే పీయూష్ జైన్ ఇంటికి చేరుకుంది.

కాగా శుక్రవారం ఉదయం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల ఏకకాలంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. కన్నోజ్‌తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తమ పార్టీ నేతలను టార్గెట్‌ చేశారని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. యుపీ ఎన్నికల వేళ ఈ ఐటీ రైడ్స్‌ కలకలం రేపుతున్నాయి.

ఈరోజు కన్నౌజ్‌లో అఖిలేష్ సమావేశం..

అఖిలేష్ యాదవ్ నేడు కన్నౌజ్‌లో పర్యటించనున్నారు. ఏ నేపధ్యంలో ఐటీ రైడ్స్ కలకలం రేగడం విశేషం. అఖిలేష్ ఇక్కడ విలేకరుల సమావేశం కూడా నిర్వహించనున్నారు. పుష్పరాజ్ కూడా ఇక్కడికి రావాల్సి ఉందని చెబుతున్నారు. ఈ సదస్సులో అఖిలేష్ సన్నిహితుల స్థలాలపై దాడులపై కూడా ప్రకటన చేస్తారని విశ్వసనీయ సమాచారం.

వరుస దాడులు..

డిసెంబర్ 23న పీయూష్ నివాసాలపై దాడులు జరిగాయి . దీని తర్వాత ఎస్పీ పెర్ఫ్యూమ్స్ తయారు చేసిన పుష్పరాజ్ జైన్ పంపి పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. 8 రోజుల తర్వాత పుష్పరాజ్ జైన్ ఇంట్లో జరిగిన దాడిలో ప్రత్యేకంగా ఏమీ లభించలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వారం రోజుల సమయంలో ఎవరైనా జాగ్రత్త పడటం పెద్ద కష్టం కాదు.

12 దేశాల్లో పుష్పరాజ్ వ్యాపారం, 47 కోట్లకు పైగా ఆస్తుల విలువ..

పుష్పరాజ్ జైన్ 2016లో ఇటావా-ఫరూఖాబాద్ నుంచి ఎస్పీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అతను ప్రగతి అరోమా ఆయిల్ డిస్టిల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహ యజమాని. అతని తండ్రి సవైలాల్ జైన్ 1950లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. పుష్పరాజ్ పెర్ఫ్యూమ్ పెద్ద వ్యాపారంగా 12 కంటే ఎక్కువ దేశాలలో విస్తరించి ఉంది. 2016 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, పుష్పరాజ్.. అతని కుటుంబానికి రూ. 37.15 కోట్ల విలువైన చరాస్తులు.. రూ. 10.10 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదు. కన్నౌజ్ కళాశాలలోనే 12 వరకు చదివారు.

ఇవి కూడా చదవండి: c VIGIL: ఈ విషయం మీకు తెలుసా? ఎన్నికల్లో అక్రమాలకు చెక్ చెప్పే యాప్ ఒకటి ఉంది..దీని గురించి తెలుసుకోండి!

పాత పాటనే కొత్తగా పాడుతున్న చైనా..అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లు మారుస్తూ తీర్మానం..చాల్చాల్లే ఫో అంటున్న భారత్!

R.Narayana Murthy: తెలుగు తెరకు ఆదర్శాల ఇజాన్ని అద్ది.. జీవితంలో అదే నిజమని ఎగసిపడుతున్న ‘ఎర్ర సముద్రం’!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu