AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: ఇస్రో ఖాతాలో మరో గ ‘ఘన విజయం’.. PSLV C53 ప్రయోగం సూపర్‌ సక్సెస్‌.. సీఎం జగన్‌ అభినందనలు..

ISRO: భారత అంతరిక్ష ప్రయాణంలో మరో కీలక విజయం దక్కింది. కమర్షియల్‌ శాటిలైట్స్‌ను నింగిలోకి పంపడంలో అగ్రగామిగా కొనసాగుతోన్న ఇస్రో (ISRO) ఇంకో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. సింగపూర్‌ ఉపగ్రహాలను విజయవంతంగా..

ISRO: ఇస్రో ఖాతాలో మరో గ 'ఘన విజయం'.. PSLV C53 ప్రయోగం సూపర్‌ సక్సెస్‌.. సీఎం జగన్‌ అభినందనలు..
Isro Pslv C53
Basha Shek
|

Updated on: Jun 30, 2022 | 10:07 PM

Share

ISRO: భారత అంతరిక్ష ప్రయాణంలో మరో కీలక విజయం దక్కింది. కమర్షియల్‌ శాటిలైట్స్‌ను నింగిలోకి పంపడంలో అగ్రగామిగా కొనసాగుతోన్న ఇస్రో (ISRO) ఇంకో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. సింగపూర్‌ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చి, అంతరిక్ష ప్రయోగాల్లో తనకెదురు లేదని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ‘నెల్లూరు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ C-53ని సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది ఇస్రో. 25గంటల కౌంట్‌డౌన్‌ ముగిసిన వెంటనే నింగిలోకి దూసుకుపోయింది రాకెట్‌. నాలుగు దశలను విజయవంతంగా పూర్తి చేసుకుని ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది’ అని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ వెల్లడించారు. కాగా సింగపూర్‌తో కుదుర్చుకున్న కమర్షియల్‌ డీల్‌ ప్రకారం పీఎస్‌ఎల్వీ C-53 ప్రయోగం చేపట్టింది ఇస్రో. మొత్తం మూడు శాటిలైట్స్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సింగపూర్‌ అవసరాల కోసం తయారు చేసిన ఈ శాటిలైట్స్‌లో ఒకదాన్ని భూపరిశీలన కోసం వినియోగించనున్నారు. ఇది, డీఎస్‌ఈవో టెక్నాలజీతో పనిచేయనుంది.

సీఎం జగన్‌ అభినందనలు.. కాగా కమర్షియల్‌ శాటిలైట్స్‌ ప్రయోగాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది ఇస్రో. ఇప్పటివరకు 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. 2016లో అయితే ఒకేసారి 104 శాటిలైట్స్‌ను నింగిలోకి పంపి చరిత్ర సృష్టించింది ఇస్రో. తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేపడుతుండటంతో భారత్‌ను, ఇస్రోను ఆశ్రయిస్తున్నాయి పలు దేశాలు. ఇకపీఎస్‌ఎల్‌వీ-సీ53ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో బృందం మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..