AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బ్రష్ చేయకుండా కిస్.. భార్య వద్దని వారించినందుకు అతను ఊహించని పని చేశాడు

బ్రష్ చేయకుండా కొడుకుకు ముద్దు పెట్టడాన్ని అడ్డుకుందని.. కట్టుకున్న భార్యనే చంపేశాడు ఓ వ్యక్తి. కేరళలోని పాలక్కడ్​లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.

Viral: బ్రష్ చేయకుండా కిస్.. భార్య వద్దని వారించినందుకు అతను ఊహించని పని చేశాడు
Man Kills Wife
Ram Naramaneni
|

Updated on: Jun 30, 2022 | 9:35 PM

Share

Crime News: అమ్మాయి-అబ్బాయి దాంపత్య బంధంతో ఒక్కటవ్వుతారు. అప్పటివరకు వారివి విభిన్న ప్రాంతాలు అయి ఉంటాయి. ఆహారపు అలవాట్లు, వ్యవహారశైలి ప్రాంతాలను బట్టి భిన్నంగా ఉంటుంది. కొంతమంది ఎక్కవ పొదువు చేయాలని కోరుకుంటారు. ఇంకొందరు భాగస్వామిగా ఎప్పుడూ శుభ్రత పాటించాలని ఆశపడతారు. పెళ్లయ్యాక ఒకరి ధోరణి.. మరొకరికి ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇద్దరూ ఒకరిని.. ఒకరు అర్థం చేసుకుని.. సర్దుబాట్లు చేసుకుని ముందుకు సాగితే కాపురం హాయిగా సాగుతుంది. లేదంటే చిన్న.. చిన్న విషయాలకు కూడా గొడవలు జరుగుతాయి. చిన్న గొడవలు కాస్తా పెద్ద ఘర్షణలకు దారి తీస్తాయి. ఈ విబేధాలు విడాకులకు, ఆత్మహత్యలు, హత్యలకు దారితీయొచ్చు.  తాజాగా కేరళ(Kerala)లోని పాలక్కడ్​(Palakkad)లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. బ్రెష్ చేయకుండా  కొడుకుకు ముద్దు పెట్టడాన్ని అడ్డుకుందని.. కట్టుకున్న అర్ధాంగినే చంపేశాడు ఓ వ్యక్తి. తమిళనాడులోని కోయంబత్తూర్​కు చెందిన దీపిక(28), అవినాశ్​(30) దంపతులు పాలక్కడ్​లోని కరాకురుస్సి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాదిన్నర వయసున్న కొడుకు ఉన్నాడు. అయితే ఉదయాన్నే పళ్లు తోముకోకుండా  కుమారుడ్ని ముద్దు పెట్టుకునేందుకు అవినాశ్ ప్రయత్నించగా.. భార్య దీపిక అడ్డుకుంది. ఈ విషయంపై ఇద్దరి మధ్య ఆర్గుమెంట్ జరిగింది. ఈ క్రమంలోనే తీవ్ర కోపోద్రిక్తుడైన అవినాశ్.. దీపికపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తల, మెడ వద్ద తీవ్ర గాయాలు అయ్యాయి. పక్కింటివారు దీపికను స్థానిక ఆస్పత్రికి తలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. దారిలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

నిందితుడు అవినాశ్ ఎయిర్​ఫోర్స్ సివిల్ కాంట్రాక్ట్ కంపెనీలో అసిస్టెంట్ సూపర్​వైజర్​గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 2 నెలల క్రితమే కుటుంబంతో కలిసి కరకురిస్సికి వచ్చినట్లు వివరించారు. అవినాశ్​కు దీపిక రెండో భార్య అని తెలిపారు. ఒడిశాకు చెందిన ఫస్ట్ వైఫ్‌కు విడాకులు ఇచ్చిన అతడు.. 2019లో దీపికను పెళ్లి చేసుకున్నాడట.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..