ISRO Spadex Mission: అంతరిక్షంలో ఇస్రో అద్భుతం.. మొలకెత్తిన అలసంద
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ అమెరికా, రష్యా, చైనా కంటే ఆలస్యంగా అడుగుపెట్టినా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఇస్రో తన ప్రతిభను చాటుతోంది. గడిచిన దశాబ్ద కాలంగా కీలకమైన ప్రయోగాల్లో విజయం సాధిస్తూ ప్రపంచ దేశాలను అబ్బురుపరుస్తోంది. తాజాగా గత నెల 30న చేపట్టిన పీఎస్ఎల్వీసీ 60 ప్రయోగం ద్వారా స్పాడెక్స్ అనే రెండు జంట ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించి కీలకమైన ప్రయోగాన్ని విజయవంతం చేసి చూపించింది.
సూర్యుడు చంద్రుడు అంగారక గ్రహాలపై కీలకమైన ప్రయోగాలను చేపట్టి.. అంతరిక్ష ప్రయోగాల్లో మేమే సాటి అని చెప్పుకుంటున్న దేశాలకు సైతం సాధ్యం కానీ ఎన్నో రహస్యాలను ఇస్రో బయట పెట్టగలిగింది. తాజాగా గత నెల 30న చేపట్టిన పీఎస్ఎల్వీసీ 60 ప్రయోగం ద్వారా స్పాడెక్స్ అనే రెండు జంట ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించి కీలకమైన ప్రయోగాన్ని విజయవంతం చేసి చూపించింది. అంతరిక్షంలో డాకింగ్ అన్ డాకింగ్ టెక్నాలజీ అనేది ఇప్పటివరకు అమెరికా రష్యా చైనా లాంటి దేశాలకు మాత్రమే సాధ్యం అయ్యే టెక్నాలజీ కాగా భారత్ తాజా ప్రయోగం విజయవంతంతో ఆ దేశాల సరసన చేరింది.
అదే ప్రయోగంలో మరో కీలకమైన ప్రయత్నంలో కూడా ఇస్రో సక్సెస్ అయ్యింది. అంతరిక్షంలో విత్తనాలను మొలకెత్తించే ప్రయత్నంలో సక్సెస్ అయిన విషయాన్ని ఇస్రో ప్రకటించింది. ఇస్రో చేపట్టే రాకెట్ ప్రయోగంలో ఇంధనం నాలుగు దశల్లో ఉంటుంది. నాలుగు దిశలు విజయవంతం అవుతూ దశలో ఉన్న పరికరాలన్నీ కిందకు పడిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మాత్రమే ప్రయోగంలో కీలకమైన ఉపగ్రహం అనేది కక్షలోకి వెళుతుంది. అయితే తాజాగా చేపట్టిన ప్రయోగంలో నాలుగో దశను కీలకమైన ప్రయోగాలకు వేదికగా మార్చుకుంది. ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ అంటే క్రాప్స్ అనే సాధనాన్ని పొందుపరిచింది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాల్లో ఈ ప్రక్రియను డెవలప్ చేశారు. ఇందులో 8 అలసంద గింజలను ఉంచారు. మైక్రో గ్రావిటీ వాతావరణంలో మొక్కల ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది అన్నదానిపై పరిశోధన కోసం ఇది దోహదపడుతుంది. భవిష్యత్తులో అంతరిక్ష యానంలో ఇది కీలకంగా ఉపయోగపడుతుంది. సుదీర్ఘంగా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టే క్రమంలో వ్యోమగాములు ఆహారాన్ని రోదసిలోని పండించుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఇస్రో చేపట్టిన తాజా ప్రయోగం ఎంతో ఉపయోగపడుతుంది. ఇస్రో చేపట్టిన ఈ ప్రక్రియలో అలసంద విత్తనాలు మొలకెత్తడం రెండు ఆకుల దేశ వరకు చేరుకోవడంతో ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతం అయినట్లు ఎక్స్ ద్వారా ప్రకటించింది. ఈ ప్రక్రియ అంత రికార్డు అయ్యేలా కెమెరాను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎప్పటికప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి