AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Jagannath temple: పూరీ జగన్నాథుడి ఆలయంపై డ్రోన్‌ కలకలం.. సర్కార్ సీరియస్

పూరీ జగన్నాథుడి ఆలయంపై డ్రోన్‌ ఎగరడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది.. దీని వెనుక ఎవరు ఉన్నప్పటికి కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆలయ సమీపంలో డ్రోన్‌ చక్కర్లు కొట్టడంతో భద్రతాపరమైన ఆందోళనలు రేకెత్తాయి. ఘటన తాలుకా పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Puri Jagannath temple: పూరీ జగన్నాథుడి ఆలయంపై డ్రోన్‌ కలకలం.. సర్కార్ సీరియస్
Puri Jagannath Temple
Ram Naramaneni
|

Updated on: Jan 05, 2025 | 8:55 PM

Share

ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంపై డ్రోన్‌ ఎగరడం తీవ్ర కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూరీ జగన్నాథుడి ఆలయం సహా చుట్టు పక్కల ప్రాంతం ‘నో ఫై జోన్‌’లో ఉంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో టెంపుల్‌పై ఒక డ్రోన్‌ అనుమానాస్పద రీతిలో కనిపించింది. అరగంట పాటు డ్రోన్‌ గుడిపై చక్కర్లు కొట్టింది. దీంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ డ్రోన్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందుకోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు.

పూరీ జగన్నాథుడి ఆలయంపై డ్రోన్‌ ఎగరడంపై ఎప్పటినుంచో నిషేధం ఉంది. భద్రతా పరమైన నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా టెంపుల్ చుట్టూ ఉన్న నాలుగు వాచ్‌టవర్ల దగ్గర 24 గంటలూ పోలీసు సిబ్బందిని మోహరించేందుకు గవర్నమెంట్ చర్యలు తీసుకుంటోంది. ఆలయంపై డ్రోన్‌ ఎగరవేసింది బహుశా సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయోన్సర్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంచలనం కోసమే ఆలయంపై డ్రోన్‌ ఎగరవేసి వీడియో తీసినట్టు ప్రచారం జరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..