ఈ కోమలి అందామనే డిగ్రీలో పట్టా పొందిదేమో.. మెస్మరైజ్ కావ్య..
07 January
202
5
Battula Prudvi
13 జూలై 1992న ఆంధ్రప్రదేశ్లోని కొత్తగూడెంలో జన్మించింది అందాల తార కావ్య కళ్యాణ్ రామ్. హైదరాబాద్‌లో పెరిగింది.
మహారాష్ట్రలోని పూణేలో సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి.
2001లో నాగార్జున, సుమంత్ ముల్టీస్టారర్ చిత్రం స్నేహమంటే ఇదేరా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ అరంగేట్రం చేసింది.
2003లో గంగోత్రిలో చిన్నప్పటి గంగోత్రి పాత్రలో, ఠాగూర్ లో చిరు పెంచుకున్న పిల్లల్లో ఒకరిగా ఆకట్టుకుంది.
తర్వాత అడవి రాముడులో ఆర్తి అగర్వాల్ చిన్నప్పటి పాత్రలో, విజయేంద్ర వర్మలో బాలయ్య కూతురి పాత్రలో మెప్పించింది.
తర్వాత బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు, ఉల్లాసంగా ఉత్సహంగా వంటి చిత్రాల్లో బాలనటిగా కనిపించింది.
2022లో మసూదా అనే ఓ తెలుగు బ్లాక్ బస్టర్ హారర్ చిత్రంతో తొలిసారి హీరోయిన్గా నటించింది ఈ వయ్యారి భామ.
2023లో బలగం, ఉస్తాద్ చిత్రాల్లో కథానాయకిగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. మూడు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
సెకండ్ ఇన్నింగ్స్లో చిరు.. హిట్స్ ఎన్ని..
తారక్ గాత్రం అందించిన సాంగ్స్ ఇవే..
SIIMA అవార్డ్స్ అందుకున్న తెలుగు డైరెక్టర్స్ వీరే..