ఈమె స్పర్శకై ఆ తారలు చీర రూపాన చెంతచేరాయి.. గార్జియస్ మేఘ..

07 January 2025

Battula Prudvi

మేఘా ఆకాష్.. నితిన్ హీరోగా నటించిన లై సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.

2017లో వచ్చిన లై సినిమా డిజాస్టర్‎గా నిలిచింది. కానీ మేఘకు మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత కూడా నితిన్‎తో మరో సినిమా చేసింది.

చల్ మోహన్ రంగ అనే టైటిల్‎తో తెరకెక్కిన ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఆతర్వాత తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

రజినీకాంత్ హీరోగా నటించిన పేట సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది మేఘ ఆకాష్. అలాగే హిందీలోనూ సినిమాలు చేసింది.

బాలీవుడ్‎లో శాటిలైట్ శంకర్‌ అనే సినిమా చేసింది ఈ చిన్నది. ఎన్ని సినిమాల్లో చేసిన సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది.

మేఘ ఆకాష్ పెద్దగా సినిమాలు చేయలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.

చివరిగా తెలుగులో డియర్ మేఘా (2021) లో కనిపించింది. 2021లో మేఘా ఏకంగా నాలుగు సినిమాల్లో నటించింది.

2024లో వికటకవి అనే తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‎సిరీస్‎లో నటించింది ఈ వయ్యారి. ఇది ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉంది.