ISRO: ఆదిత్య ఎల్1 మార్గాన్ని సరిదిద్దాం.. ఇస్రో కీలక ప్రకటన

సూర్యుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన ‘ఆదిత్య- ఎల్‌1 ఉపగ్రహం తన లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తోంది. అయితే ఇప్పటికే ఆదిత్య ఎల్1 ఉపగ్రహం భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసింది. ఈ క్రమంలోనే వ్యౌమనౌక మార్గాన్ని సరిదిద్దే విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొంది. లగ్రాంజ్‌ పాయింట్‌-1 (L1) దిశగా దూసుకెళ్తున్నటువంటి వ్యౌమనౌకను దాని నిర్దేశిత మార్గంలో ఉంచేందుకు టీసీఎం ఎంతగానో దోహదపడుతుంది.

ISRO: ఆదిత్య ఎల్1 మార్గాన్ని సరిదిద్దాం.. ఇస్రో కీలక ప్రకటన
Aditya L1
Follow us
Aravind B

|

Updated on: Oct 08, 2023 | 9:26 PM

సూర్యుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన ‘ఆదిత్య- ఎల్‌1 ఉపగ్రహం తన లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తోంది. అయితే ఇప్పటికే ఆదిత్య ఎల్1 ఉపగ్రహం భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసింది. ఈ క్రమంలోనే వ్యౌమనౌక మార్గాన్ని సరిదిద్దే విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొంది. లగ్రాంజ్‌ పాయింట్‌-1 (L1) దిశగా దూసుకెళ్తున్నటువంటి వ్యౌమనౌకను దాని నిర్దేశిత మార్గంలో ఉంచేందుకు టీసీఎం ఎంతగానో దోహదపడుతుంది. అయితే అక్టోబరు 6వ తేదీన 16 సెకన్ల పాటు ఈ విన్యాసాన్ని నిర్వహించినట్లు ఇస్రో పేర్కొంది. ఇదిలా ఉండగా.. అంతకుముందు ఇస్రో శాస్త్రవేత్తలు.. సెప్టెంబరు 19న ట్రాన్స్- లగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ విన్యాసాన్ని నిర్వహించి.. ఆదిత్య ఉపగ్రహాన్ని ‘ఎల్‌ 1’ వద్దకు చేర్చే మార్గంలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈ విన్యాసాన్ని ట్రాక్‌ చేశారు.

అలాగే ఈ ట్రాజెక్టరీని కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉందని గుర్తించారు ఇస్రో శాస్త్రవేత్తలు. అయితే ఇందుకోసం తాజా విన్యాసం అవసరమైనట్లు చెప్పారు. ఆదిత్య ఎల్‌-1లోని వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని.. లగ్రాంజ్‌ పాయింట్‌-1 దిశగా దూసుకెళ్తోందని పేర్కొన్నారు. అలాగే మరికొన్ని రోజుల్లో మాగ్నెటోమీటర్ మళ్లీ ఆన్ చేస్తామని వెల్లడించారు. చంద్రయాన్‌-3 విజయవంతం అయిన తర్వాత సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో సెప్టెంబర్‌ 2న ఆదిత్య-ఎల్‌ 1 ప్రయోగాన్ని చేపట్టింది. అయితే పీఎస్‌ఎల్‌వీ సీ-57 వాహకనౌక ద్వారా ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించింది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధన చేయడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. భారత్‌ తరఫున సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో తొలి మిషన్‌ కూడా ఇదే. అయితే ఇది భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లగ్రాంజ్‌ పాయింట్‌-1 చేరాక.. దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ సూర్యుడిపై పరిశోధనలు ప్రారంభిస్తుంది .

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.