AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: నేడు ప్రారంభం కానున్న జ్యోతిర్లింగ దర్శన్ యాత్రా ట్రైన్: ప్యాకేజీ వివరాలు ఇవే!

పుణ్యక్షేత్రాలు సందర్శించుకునేవారి కోసం ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)...

IRCTC: నేడు ప్రారంభం కానున్న జ్యోతిర్లింగ దర్శన్ యాత్రా ట్రైన్: ప్యాకేజీ వివరాలు ఇవే!
Irctc
Basha Shek
|

Updated on: Oct 21, 2021 | 9:21 AM

Share

పుణ్యక్షేత్రాలు సందర్శించుకునేవారి కోసం ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ‘జ్యోతిర్లింగ దర్శన్‌ యాత్ర’ పేరుతో నేడు ప్రత్యేక రైలును ప్రారంభించనుంది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌ సంగం స్టేషన్‌ నుంచి ఈ రైలు బయలుదేరనుంది. మొత్తం 10 రోజుల పాటు సాగే ఈ యాత్రలో భక్తులు మహాకాలేశ్వర్, ఓంకారేశ్వర్‌, సోమనాథ్‌, నాగేశ్వర్ వంటి ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు ద్వారకాలోని ద్వారకా దీష్‌ మందిరం, భెంట్ ద్వారకా మందిరం, అహ్మాదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమం, బరోడాలోని స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ, ఉదయ్‌పూర్‌ సిటీ ప్యాలెస్‌, మహారాణా ప్రతాప్‌ స్మారక మందిరాలను దర్శించుకోవచ్చు. ప్రయాగ రాజ్‌, ప్రతాప్‌ గఢ్‌, అమేఈ, రాయ్‌ బరేలీ, లక్నో, కాన్పూర్, ఎటావా, భింద్‌, గ్వాలియర్‌, ఝాన్సీ స్టేషన్ల మీదుగా ఈ యాత్ర సాగనుంది.

ప్యాకేజీ వివరాలు ఇవే.. ఈ తీర్థయాత్రకు సంబంధించి ఈ నెల ప్రారంభంలోనే అడ్వాన్స్‌ బుకింగ్‌ సేవలు ప్రారంభించింది ఐఆర్‌సీటీసీ . ప్యాకేజీ వివరాలు ఎలా ఉన్నాయంటే… ప్రయాణ వ్యవధి: 10 రాత్రుళ్లు, 11 రోజులు ప్యాకేజీ ధర: ఒక్కొక్కరికి రూ.10,395 యాత్రలో భాగంగా ప్రయాణికులకు కావల్సిన వసతి, ఆహార సదుపాయాలన్నింటినీ ఐఆర్‌సీటీసీనే అందిస్తోంది. ఇందుకు ఎలాంటి ప్రత్యేక ఛార్జీలు ఉండవు. ఇక వివిధ సందర్శన స్థలాలకు వెళ్లనప్పుడు సైట్ సీయింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీనే ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటుచేయనుంది. ప్రయాణికలు ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. భక్తులు ప్రయాగరాజ్‌ స్టేషన్‌ నుంచే కాకుండా పైన చెప్పిన వివిధ స్టేషన్లలో కూడా ఎక్కచ్చు.

Also Read:

Silver Rate Today: బంగారం బాటలోనే వెండి.. స్వల్పంగా పెరిగిన సిల్వర్‌ రేట్‌.. ఎంత పెరిగిందంటే..

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Illegal liquor: ఓరి గడుగ్గాయ్.. బైక్‌లో ఇన్ని లిక్కర్ బాటిల్సా.. కౌంట్ చేసి కంగుతిన్న పోలీసులు